మార్కుల వెల్లడిలో పొరపాట్లు జరగలేదు : అశోక్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పునర్‌మూల్యాంకనంలో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య వెల్లడిలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని తెలంగాణ ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు.
ఈ మేరకు జూన్ 7వ తేదీన ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి మొత్తం 9,02,429 విద్యార్థుల రీవెరిఫికేషన్ పూర్తి చేశామని, తర్వాత జవాబుపత్రాలను విడతలవారీగా స్కానింగ్ చేశామని చెప్పారు. 8,82,641 మంది జవాబు పత్రాలు స్కానింగ్ చేసేనాటికి 1,137 మంది, మరో 19,788 జవాబుపత్రాల స్కానింగ్ అనంతరం మరో 18 మంది పాసై, మిగిలిన జవాబుపత్రాల స్కానింగ్ పూర్తయ్యేసరికి మరో 28 మంది పాసవడంతో మొత్తం ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య 1,183కు చేరుకుందని పేర్కొన్నారు. ఈ వివరాలను కోర్టుకు అందజేశామని, అంతేతప్ప ఫలితాల వెల్లడిలో ఎలాంటి అవకతవకలు జరగలేదని అశోక్ స్పష్టం చేశారు.
Published date : 08 Jun 2019 04:08PM