మార్కెట్‌లో ఇంటర్ ‘కొత్త’ పుస్తకాలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ప్రథమ సంవత్సరంలో వివిధ భాషలకు సంబంధించిన సిలబస్‌ను మార్పు చేసినట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.
సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబిక్ భాషలకు సంబంధించిన పుస్తకాల్లో మార్పులు చేసినట్లు పేర్కొంది. ఈ సిలబస్ 2018-19 విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి వస్తుందని తెలిపింది. పుస్తకాలను మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది. మరోవైపు గతంలో ఫెయిలైన విద్యార్థులు 2019 మార్చి వార్షిక పరీక్షల్లో, మే/జూన్ నెలలో జరిగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో పాత సిలబస్‌లో పరీక్షలు రాయవచ్చని పేర్కొంది.
Published date : 14 Jun 2018 02:47PM