మార్చి 9న జరిగే ఇంటర్ పరీక్షలు వాయిదా!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మార్చి 9న జరగాల్సిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలను వాయిదా వేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది.
అదే రోజు రంగారెడ్డి, హైదరాబాద్, మాహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు ఉన్నందున పరీక్షను వాయిదా వేసేందుకు బోర్డు దృష్టి సారించింది. మార్చి 9న జరగాల్సిన ఇంటర్ ద్వితీయ సంవత్సర మ్యాథమెటిక్స్ పేపరు-2బి, జువాలజీ పేపరు-2, హిస్టరీ పేపరు-2 పరీక్షలను అదే నెల 20న నిర్వహించే అవకాశం ఉంది. మార్చి 1 నుంచి ప్రారంభం అయ్యే ఇంటర్ వార్షిక పరీక్షలు 18వ తేదీతో ముగియనున్నాయి. 19వ తేదీ ఆదివారం కావడంతో 20వ తేదీ (సోమవారం) ఈ పరీక్షలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
Published date : 08 Feb 2017 01:52PM