మార్చి 8 నుంచి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం
Sakshi Education
హైదరాబాద్: మరికొన్ని రోజుల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగుస్తున్నందున జవాబు పత్రాల మూల్యాంకనం చేయడానికి జిల్లాల తెలంగాణ ఇంటర్మీడియట్ అధికారులు ఏర్పా ట్లు మొదలుపెట్టారు.
మార్చి 8వ తేదీ నుంచి మూల్యాంకనం మొదలవనుంది. రోజువారీగా పరీక్షలు ముగిశాక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపులోకి జవాబు పత్రాలను తరలిస్తారు. మూల్యాంకనం పరిశీలన, మార్కుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించారు. హైదరాబాద్‌లో రెండుచోట్ల మూల్యాంకనం జరుగుతుంది. ఉద యం 9 నుంచి మధ్యాహ్నం 12:30ల వరకు, మధ్యా హ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు దఫాల వారీగా 30 పేపర్లు మూల్యాంకనం చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. మూల్యాంకనం చేసేందుకు జనరల్ పేపర్లకు 1,500 మంది, ఒకేషనల్ పేపర్లకు 1,000 మంది అధ్యాపకులు పాల్గొననున్నారు. మొదటి విడతలో ఇంగ్లిష్, తెలుగు, హిందీ, సంస్కృతం, గణితం, సివిక్స్, రెండో విడతలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మూడో విడతలో బాటనీ, జువాలజీ, కామర్స్, హిస్టరీ పేపర్లకు ముల్యాంకనం నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో మహబూబియా బాలికల కళాశాల, నాంపల్లిలోని ప్రభుత్వ కళాశాలలో క్యాంపులను ఏర్పాటు చేశారు.
Published date : 05 Mar 2018 01:44PM