Skip to main content

మార్చి 7 నుంచి ‘ఇంటర్’ స్పాట్ వ్యాల్యుయేషన్

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ స్పాట్ వ్యాల్యుయేషన్‌ను గురువారం (7న) నుంచి చేపట్టేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది.
ఐదు దఫాలుగా వ్యాల్యుయేషన్‌ను చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. మొదటి దఫాలో ఈ నెల 7న సంస్కృతం పేపరు-1, పేపరు-2 జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టనుంది. ఈ నెల 14 నుంచి ఇంగ్లిష్, తెలుగు, హిందీ, మ్యాథ్స్, సివిక్స్ జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టనుంది. ఈ నెల 19 నుంచి ఫిజిక్స్, ఎకనామిక్స్ జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టేలా ఏర్పాట్లు చేసింది. ఈ నెల 22 నుంచి కెమిస్ట్రీ, హిస్టరీ స్పాట్ వ్యాల్యుయేషన్‌ను చేపట్టనుంది. ఈ నెల 25 నుంచి కామర్స్, బోటనీ, జువాలజీ జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టేలా ఏర్పాట్లు చేసింది.
Published date : 07 Mar 2019 01:39PM

Photo Stories