కేజీబీవీల్లో ఇంటర్ విద్య
Sakshi Education
కర్నూలు సిటీ: వచ్చే విద్యా సంవత్సరం(2018-19) నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని 26 కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టనున్నట్లు సర్వశిక్ష అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) రాష్ట్ర ప్రాజెక్టు అధికారి(ఎస్‌పీడీ) శ్రీనివాస్ వెల్లడించారు.
కర్నూలులో ఏప్రిల్ 10న ‘బడి రుణం తీర్చుకుందాం’ కార్యక్రమం పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు కేజీబీవీల్లో వేసవి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. 2017-18 విద్యా సంవత్సరంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.2,900 కోట్లకు గాను రూ.924 కోట్ల నిధులు మాత్రమే వచ్చాయన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు కేటాయించిన నిధుల్లో 40 శాతానికి మించి ఇవ్వడం లేదన్నారు. వచ్చిన నిధులు టీచర్లు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది వేతనాలకే సరిపోతున్నాయని, దీంతో నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మంది విద్యార్థులకు స్కూల్ యూనిఫాం అందించేందుకు ఇండెంట్ వచ్చిందని తెలిపారు.
Published date : 11 Apr 2018 03:08PM