Skip to main content

కేజీబీవీల్లో ఇక ఇంటర్మీడియెట్

సాక్షి, హైదరాబాద్: కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలను (కేజీబీవీ) ఇంటర్మీడియెట్ వరకు పొడిగించేందుకు కేంద్రం ఓకే చెప్పినట్లు తెలిసింది.
ప్రస్తుతం తెలంగాణలోని 485 కేజీబీవీల్లో 6 నుంచి 8వ తరగతి వరకు కొనసాగించేందుకు కేంద్రం ఆమోదం ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటిని పదో తరగతి వరకు కొనసాగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఇంటర్ వరకు కొనసాగించేందుకు కేంద్రం అనుమతించింది. వీటికి అవసరమైన నిధులిస్తామని కూడా పేర్కొన్నట్లు తెలిసింది. జనవరి 30న ఢిల్లీలో జరిగిన విద్యా పథకాల విలీనం సమావేశంలో ఈ మేరకు అంగీకరించినట్లు సమాచారం.
Published date : 31 Jan 2018 02:04PM

Photo Stories