జంబ్లింగ్ విధానంలో ఇంటర్ ప్రాక్టికల్స్: ఆర్‌ఐవో
Sakshi Education
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ప్రయోగ (ప్రాక్టికల్స్) పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ఇంటర్ విద్య ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్‌ఐవో) టీవీ కోటేశ్వరరావు తెలిపారు.
సాంబశివపేటలోని ఆర్‌ఐవో కార్యాలయంలో మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ ఏడాది జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు సన్నద్ధమైందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లోని ప్రయోగశాలలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పూర్తి స్థాయిలో పరికరాలు ఉన్న వాటినే పరీక్షల నిర్వహణకు ఎంపిక చేసి, బోర్డుకు నివేదిక పంపినట్లు తెలిపారు. అలాగే మార్చి 1 ఇంటర్ నుంచి థియరీ పరీక్షలు జరగనున్నట్లు వెల్లడించారు.
Published date : 14 Dec 2016 02:44PM