జేఈఈలో ఆధార్ అనుసంధానంపై ఏర్పాటు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఎన్‌ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తులో ఈసారి ఆధార్ నంబర్ అనుసంధానం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.
దీంతో విద్యార్థుల సౌకర్యార్థం సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఏపీలో నాలుగు, తెలంగాణలో మూడు ముఖ్యపట్టణాల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. జేఈఈ ఆన్‌లైన్ దరఖాస్తుల్లో అభ్యర్థులు ఆధార్ నంబర్‌ను, అభ్యర్థిపేరు, పుట్టిన తేదీలను తప్పనిసరిగా నమోదు చేయాలి. ఆధార్ కార్డులు లేని విద్యార్థులు ఆధార్ కార్డులు జారీచేసే "www.uidai.in’ వెబ్‌సైట్లో ఆధార్‌కార్డు కోసం నమోదు చేసుకోవచ్చని సూచించింది. దీంతోపాటు సీబీఎస్‌ఈ తరఫున కూడా దేశవ్యాప్తంగా సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సెంటర్ల పేర్లు, ఎక్కడున్నాయో చిరునామాలతోసహా జేఈఈ మెరుున్-2017 వెబ్‌సైట్లో పొందుపరిచారు. ఆధార్ కేంద్రాలు అందుబాటులో లేని అభ్యర్థులు ఆధార్ నమోదు కోసం సహాయ కేంద్రాల్లో దరఖాస్తు అందిస్తే వారు రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారని, ఆ రిజిస్ట్రేషన్ నంబర్‌ను కూడా ఆన్‌లైన్ దరఖాస్తులో నమోదు చేయవచ్చని వివరించింది.
ఏపీ, తెలంగాణలో ఆధార్ సహాయ కేంద్రాలు:
గుంటూరు: డాక్టర్ కేఎల్‌పీ పబ్లిక్ స్కూల్, జేకేసీ కాలేజీ రోడ్.
తిరుపతి: కేంద్రీయ విద్యాలయం-1, రామ్‌నగర్ ఏరియా, చెన్నారెడ్డి కాలనీ
విజయవాడ: కేసీపీ సిద్ధార్థ ఆదర్శ రెసిడెన్షియల్ స్కూల్, కానూరు
విశాఖపట్నం: కేంద్రీయ విద్యాలయం, ఎన్‌ఏడీ పోస్టు,
హైదరాబాద్: డీఏవీ పబ్లిక్ స్కూల్ సఫిల్‌గూడ, సంతోషిమా నగర్, నేరేడ్‌మెట్
ఖమ్మం: హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్, మమత హాస్పిటల్ దగ్గర, పాకబండ బజార్
వరంగల్: సెయింట్ పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్, పాత బస్‌డిపో రోడ్డు, హన్మకొండ

Published date : 05 Dec 2016 04:02PM