జేఈఈ టాపర్‌కు ‘ఐఐటీ బాంబే’లో సీటు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్‌సడ్‌లో జాతీయ స్థాయిలో టాప్-1 ర్యాంకర్ కార్తికేయ్ గుప్తాకు ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్‌సలో సీటు లభించింది.
ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఇతర విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశాలకు నిర్వహించిన మొదటి విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపును జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) జూన్ 27న ప్రకటించింది. ఐఐటీల వారీగా సీట్లు పొందిన విద్యార్థుల ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంకులను ప్రకటించింది. బోర్డుల వారీగా టాప్ 20 పర్సంటైల్ కటాఫ్ మార్కుల వివరాలను వెల్లడించింది. తెలంగాణ బోర్డులో కోర్ సబ్జెక్టుల్లోని మొత్తం 500 మార్కులకు జనరల్ కేటగిరీలో 462 మార్కులు, ఓబీసీ నాన్ క్రీమీలేయర్‌లో 460 మార్కులు, ఎస్సీలో 447 మార్కులు, ఎస్టీలో 454 మార్కులు, దివ్యాంగుల్లో 447 మార్కులను కటాఫ్‌గా తీసుకున్నట్లు వివరించింది. ఇక మొదటి దశలో సీట్లు లభించిన విద్యార్థులు జూన్ 28 నుంచి సంబంధిత రిపోర్టింగ్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలని జోసా సూచించింది. రెండో దశ సీట్ల కేటాయింపును జూలై 3వ తేదీన ప్రకటించనున్నట్లు వివరించింది.
బాంబే, హైదరాబాదుల్లో ర్యాంకులిలా...
బాంబే ఐఐటీలో జనరల్‌లో ఓపెనింగ్ ర్యాంకు 1 కాగా, క్లోజింగ్ ర్యాంకు 63గా ప్రకటించింది. జనరల్ దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ దివ్యాంగుల్లో ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంకు 1గానే పేర్కొంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఓపెనింగ్ ర్యాంకు 3కాగా.. క్లోజింగ్ ర్యాంకు 6గా పేర్కొంది. ఓబీసీ నాన్ క్రీమీలేయర్‌లో ఓపెనింగ్ ర్యాంకు 7 కాగా, క్లోజింగ్ ర్యాంకు 35గా వెల్లడించింది. మహిళల జనరల్ కోటాలో ఓపెనింగ్ ర్యాంకు 10 కాగా, క్లోజింగ్ ర్యాంకు 313గా తెలిపింది. ఐఐటీ హైదరాబాద్‌లో కంప్యూటర్ సైన్‌సలో జనరల్ కేటగిరీలో ఓపెనింగ్ ర్యాంకు 203 కాగా, క్లోజింగ్ ర్యాంకు 613గా వెల్లడించింది.
ప్రభుత్వ కాలేజీలో చదువుకొని ఐఐటీ సీటు సాధించిన పవిత్ర :
తల్లి వ్యవసాయ కూలీ.. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద కుటుంబం. ప్రభుత్వ జూనియర్ కాలేజీ చదువు.. అయినా ఆ విద్యార్థికి తాను బాగా చదువుకోవాలన్న తపన ముందు అవేవీ అడ్డుకాలేదు. బాగా చదువుకొని ఏదైనా సాధించాలన్న తపన, ప్రభుత్వ కాలేజీ లెక్చరర్ల తోడ్పాటు ఆమెను ఐఐటీలో సీటు సాధించేలా చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివిన ఎస్.పవిత్రకు ఐఐటీ ధన్‌బాద్‌లో సీటు లభించింది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు చేపట్టిన ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపును జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా)జూన్ 27నప్రకటించింది. ఇందులో పవిత్రకు ఐఐటీ ధన్‌బాద్‌లో సీటు లభించింది. తల్లి ధనలక్ష్మి రోజూ కూలి పనికి వెళ్తూ కూతురు పవిత్రను చదివించింది. పవిత్ర కూడా ఎలాంటి కోచింగ్ లేకపోయినా కష్టపడి చదువుకొని ఇంటర్మీడియట్‌లో 936 మార్కులు సాధించింది. జేఈఈ అడ్వాన్‌సడ్‌లో ఎస్సీ కేటగిరీలో 2,954 ర్యాంకును సాధించింది.

Published date : 28 Jun 2019 04:27PM