జేఈఈ దరఖాస్తుకు గడువు పెంపు
Sakshi Education
న్యూఢిల్లీ: జేఈఈ(మెయిన్స్)-2017 ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి గడువును సీబీఎస్‌ఈ జనవరి 16 దాకా పొడిగించింది.
విద్యార్థుల విజ్ఞప్తుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. విద్యార్థులు జనవరి 17 వరకు ఫీజు చెల్లించొచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించడానికి నియమ నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టంచేసింది. ఇదివరకు జేఈఈ ఆన్‌లైన్ దరఖాస్తుకు జనవరి 2ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.
Published date : 31 Dec 2016 01:35PM