Skip to main content

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో తెలుగు తేజాల సత్తా

సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: దేశంలోని వివిధ ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ -2019 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు.
టాప్-10 ర్యాంకుల్లో మూడు ర్యాంకులను సొంతం చేసుకున్నారు. తెలంగాణలోని వనపర్తి జిల్లాకు చెందిన గిల్లెల ఆకాశ్‌రెడ్డి జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకును సాధించగా, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన బట్టేపాటి కార్తికేయ ఆలిండియా 5వ ర్యాంకును, ఏపీకే చెందిన ఎం.తివేశ్‌చంద్ర 8వ ర్యాంకును సాధించాడు. అలాగే టాప్-100లో 30 ర్యాంకులను, టాప్-500లో 132 ర్యాంకులను హైదరాబాద్ ఐఐటీ జోన్ పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ పరిధిలోని విద్యార్థులు సాధించారు. టాప్-1000 ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులే దాదాపు 300 మంది వరకు ఉంటారని విద్యా సంస్థలు చెబుతున్నాయి. ఆలిండియా టాపర్‌గా మహరాష్ట్రలోని బళ్లార్‌పూర్‌కు చెందిన గుప్తా కార్తికేయ చంద్రేశ్ 372 మార్కులకుగాను 346 మార్కులను సాధించి జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచాడు. 2వ ర్యాంకును అలహాబాద్‌కు చెందిన హిమాన్షు గౌరవ్‌సింగ్ సాధించగా 3వ ర్యాంకును ఢిల్లీకి చెందిన అర్చిత్ బబ్నా సాధించారు. 308 మార్కులతో జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు సాధించిన ఐఐటీ బాంబే జోన్ పరిధి ప్రాంతానికి చెందిన షబ్నం సాహే బాలికల కేటగిరీలో టాపర్‌గా నిలిచారు.

38,705 మంది అర్హులు :
మే 27వ తేదీ నిర్వహించిన జేఈఈ అడ్వాన్‌‌సడ్ పరీక్ష ఫలితాలను ఐఐటీ రూర్కీ జూన్ 14న విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 1,61,319 మంది హాజరయ్యారు. వారిలో 38,705 మంది అడ్వాన్స్‌డ్‌ లో అర్హత సాధించారు. అర్హత సాధించిన వారిలో 33,349 మంది బాలురు ఉండగా 5,336 మంది బాలికలు ఉన్నారు.

అర్హుల్లో రెండో స్థానంలో ఐఐటీ హైదరాబాద్ జోన్ :
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ లో అర్హత సాధించిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులు ఢిల్లీ ఐఐటీ జోన్ పరిధికి చెందినవారే ఉండగా రెండో స్థానంలో ఐఐటీ హైదరాబాద్ జోన్ పరిధిలోని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ లో అర్హత సాధించిన 38,705 మంది విద్యార్థుల్లో ఢిల్లీ జోన్ పరిధిలోని ప్రాంతాలకు చెందిన 9,477 మంది అర్హత సాధించగా ఐఐటీ హైదరాబాద్ జోన్ పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాంతాలకు చెందిన 8,287 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మూడో స్థానంలో ఐఐటీ బాంబే పరిధిలోని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 6,140 మంది అర్హత సాధించారు.

హైదరాబాద్ ఐఐటీ జోన్ పరిధిలో టాపర్లు వీరే...
టాప్ ర్యాంకుల సాధించిన విద్యార్థుల్లో ఐఐటీ జోన్లవారీగా ఐదేసి మంది వివరాలను ఐఐటీ రూర్కీ ప్రకటించింది. అందులో హైదరాబాద్ ఐఐటీ జోన్ పరిధిలో గిల్లెల ఆకాశ్‌రెడ్డి 4వ ర్యాంకు సాధించగా 5వ ర్యాంకును బట్టేపాటి కార్తికేయ సాధించారు. కౌస్థుబ్ డీఘే 7వ ర్యాంకు సాధించగా, ఎం. తివేశ్ చంద్ర 8వ ర్యాంకు, అమిత్ రాజారామన్ 12వ ర్యాంకు, గుంపర్తి వెంకటకృష్ణ సూర్య లిఖిత్ 13వ ర్యాంకు సాధించారు. మరోవైపు జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు సాధించిన గిల్లెల ఆకాశ్‌రెడ్డి హైదరాబాద్ ఐఐటీ జోన్ పరిధిలో బాలుర కేటగిరీలో టాపర్‌గా నిలవగా జాతీయ స్థాయిలో 44వ ర్యాంకు సాధించిన సూరపనేని సాయివిజ్ఞ బాలికల కేటగిరీలో హైదరాబాద్ ఐఐటీ జోన్‌లో టాపర్‌గా నిలిచారు.

ఏఏటీకి దరఖాస్తులు...
ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టుకు (ఏఏటీ) రిజిస్ట్రేషన్లను ఐఐటీ రూర్కీ ప్రారంభించింది. విద్యార్థులు జూన్ 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొంది.

ఓపెన్ కేటగిరీ జాతీయ స్థాయి టాపర్లుగా నిలిచిన తెలుగు తేజాలు...
పేరు జాతీయ ర్యాంకు
గిల్లెల ఆకాశ్‌రెడ్డి 4
బట్టేపాటి కార్తికేయ 5
ఎం. తివేశ్‌చంద్ర 8
జీవీకే సూర్య లిఖిత్ 13
వేద ప్రణవ్ 21
విశ్వంత్ 27
ముఖేశ్‌రెడ్డి 43
సూరపనేని సాయి విగ్న 44
భరణి కుమార్ 58
క్రాంతి చంద్రారెడ్డి 64
రవి శ్రీతేజ 65
భరత్‌చంద్ 81
అభిజిత్‌రెడ్డి 84

ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో...
డి.చంద్రశేఖర ఎస్‌ఎస్ హేతహవ్య 1
శ్రీమాన్‌రెడ్డి 4
సాత్విక్‌రెడ్డి 6
అజయ్ 7

అడ్వాన్స్‌డ్‌ లో కేటిగిరీలవారీగా అర్హులు వీరే..

కేటగిరీ

రిజిస్టర్డ్

హాజరు

అర్హులు

వికలాంగులు

మొత్తం అర్హులు

(రిజస్టర్డ్ హాజరు అర్హులు)
జనరల్ 53,704 50,475 15,329 971 851 237 15,566
జనరల్ (ఈడబ్ల్యూస్)16,604 15,703 3,612 73 66 24 3,636
ఓబీసీ నాన్ క్రీమీలేయర్ 62,213 57,543 7,526 681 598 125 7,651
ఎస్సీ 27,862 25,343 8,742 119 96 16 8,758
ఎస్టీ 12,152 10,598 3,084 53 46 10 3,094
మొత్తం -- -- -- -- -- -- 38,705

ఐఐటీల జోన్ వారీగా అర్హుల వివరాలు...
జోన్
జోన్ టాపర్
అలిండియా ర్యాంకు
జోన్‌లో టాపర్లసంఖ్య
మొత్తం అర్హులు
---
---
---
10లోపు
110లోపు
500లోపు
---
బాంబే
గుప్తా కార్తికేయ్ చంద్రేశ్
1
3
14
95
6,140
ఢిల్లీ
హిమాన్షు గౌరవ్ సింగ్
2
4
29
167
9,477
గౌహతి
ప్రదీప్త పరాగ్ బోర
28
0
2
4
1,822
కాన్పూర్
ధ్రువ్ అరోరా
24
0
7
20
4,515
ఖరగ్‌పూర్ గుడిపాటి అనికేత్
29
0
10
28
 
4,525
హైదరాబాద్
గిల్లెల ఆకాశ్‌రెడ్డి
4
3
30
132
8,287
రూర్కీ
జయేష్ సింగ్లా
17
0
8
54
3,939
మొత్తం
---
--
10
100
500
38,705

టాపర్ల అభిప్రాయాలు..
సోషల్ మీడియాకు దూరంగా ఉన్నా: గుప్తా
Edu news జేఈఈ (అడ్వాన్స్‌డ్‌) 2019 ఫలితాల్లో గుజరాత్‌కు చెందిన గుప్తా కార్తికేయ చంద్రేశ్ 372కు గాను 346 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు.సోషల్ మీడియాకు దూరంగా ఉండి, కష్టపడి చదవడం వల్లే మొదటి ర్యాంకు సాధించగలిగానని గుప్తా కార్తికేయ అన్నారు. తన తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్ ఇస్తామని చెప్పినప్పటికీ తానే తిరస్కరించానని అన్నారు. చదువులో ఎదురయ్యే ఒత్తిడి తగ్గించుకోవడానికి బాడ్మింటన్ ఆడటంతోపాటు మిత్రులతో కలసి ఆహారం తినేవాడినని అన్నారు. గుప్తా తండ్రి ఓ పేపర్ తయారీ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గుప్తా రెండు సంవత్సరాలుగా ముంబైలో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడని అతడి తల్లి పూనమ్ తెలిపారు. క్లాసులు ముగిశాక కూడా ఆరేడు గంటలు చదువుకునేవాడని ఆమె అన్నారు. టాప్-10లో తమ కుమారుడు నిలుస్తాడన్న నమ్మకం ముందు నుంచీ ఉందని తెలిపారు.

విద్యార్థినుల విభాగంలో సహాయ్ టాప్ : Edu news
కామన్ ర్యాంక్ లిస్టు (సీఆర్‌ఎల్)లో గుప్త కార్తికేయ మొదటిస్థానం సాధించగా, 308 మార్కులతో పదో ర్యాంక్ సాధించిన షబ్నమ్ సహాయ్ విద్యార్థిని విభాగంలో టాప్‌గా నిలిచారు. ఈమెకు నృత్యంతోపాటు పియానో వాయించడంలో కూడా నైపుణ్యం ఉంది. రోజుకు ఎనిమిది గంటలపాటు చదివానని ఆమె అన్నారు. ఉపాధ్యాయులతో, మిత్రులతో మాట్లాడటానికి మాత్రమే వాట్సప్ వినియోగించానని తెలిపారు. సహాయ్ తండ్రి ఐఐఎం-అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. మాదాపూర్‌కు చెందిన సూరపనేని సాయి వంగ, ముంబైకి చెందిన తులిప్ పాండే విద్యార్ధినుల విభాగంలో రెండు, మూడు ర్యాంకులు సాధించారు.

సాఫ్ట్‌వేర్ కంపెనీ పెడతా...
Edu news
నా కష్టానికి ప్రతిఫలంగా మంచి ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్‌‌సలో బీటెక్, ఎంటెక్ చేసి సొంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టి కొందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే నా లక్ష్యం.
- ఆకాశ్‌రెడ్డి, జేఈఈ అడ్వాన్‌‌సడ్ 4వ ర్యాంకర్

సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతా..
Edu news
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ లో 5వ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్‌‌స చేస్తా. ఆ తరువాత సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతా. లేదంటే ఉద్యోగం చేస్తా.
- బట్టేపాటి కార్తికేయ, 5వ ర్యాంకర్

సివిల్ సర్వెంట్ కావాలని ఉంది...
సివిల్ సర్వెంట్ కావాలన్నదే నా లక్ష్యం. అందుకోసం ఇప్పటి నుంచే కృషి చేస్తా. టాప్-10లో ర్యాంకు వస్తుందనుకున్నా. అయినా మంచి ర్యాంకే వచ్చింది. ఐఐటీ బాంబేలో బీటెక్ చేస్తా.
- సూర్య లిఖిత్, 13వ ర్యాంకర్
Published date : 15 Jun 2019 06:18PM

Photo Stories