జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ‘కీ’ మే 29 న విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో కెమిస్ట్రీ పేపర్-1, మాథ్స్ పేపర్-2లు కఠినంగా ఉన్నాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు.
మే 20న జరిగిన పరీక్షలో పేపర్-1 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీలతో పోలిస్తే మాథ్స్ కాస్త సులువుగా ఉందంటున్నారు. ఫిజిక్స్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండగా, కెమిస్ట్రీ ప్రశ్నలు కఠినంగా ఉన్నాయంటున్నారు. మధ్యాహ్నం జరిగిన పేపర్-2లో మాథ్స్ ప్రశ్నలు కఠినంగా, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు మధ్యస్థంగా ఉన్నాయంటున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కీ ని మే 29 నుంచి అందుబాటులో ఉంచుతామని ఐఐటీ కాన్పూర్ తెలిపింది. ఫలితాలు జూన్ 10న ప్రకటిస్తామని పేర్కొంది.
Published date : 21 May 2018 05:52PM