Skip to main content

ఇంటర్మీడియట్ కొత్త విద్యా సంవత్సరం ఎప్పటి నుంచి అంటే..?

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్మీడియట్ కొత్త విద్యా సంవత్సరం ఈసారి కనీసం రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభం కానుంది.
జూన్ రెండో వారంలోగా కరోనా అదుపులోకి వస్తేనే ఆగస్టు నుంచి ప్రథమ సంవత్సర తరగతులు ప్రారంభమయ్యే అవకాశముంది. లేదంటే ఇంకొంత ఆలస్యం తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో టెన్త్ పరీక్షలు, మూల్యాంకనం, ఫలితాల వెల్లడి, ఇంటర్మీడియట్ ప్రవేశాలు, ఆ తరువాత చేపట్టాల్సిన కార్యాచరణపై బోర్డు నియమించిన అధికారుల కమిటీ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. నేడో రేపో ఇది నివేదికను బోర్డుకు అందజేయనుంది.
Published date : 05 May 2020 02:11PM

Photo Stories