Skip to main content

ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శిగా ఉదయలక్ష్మి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శిగా, కమిషనర్‌గా బి.ఉదయలక్ష్మి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
ఇంతకు ముందు సాంకేతిక విద్య, కాలేజీ విద్య శాఖలకు కమిషనర్‌గా పనిచేసిన ఉదయలక్ష్మిని ప్రభుత్వం ఇంటర్మీడియెట్ విద్యకు బదిలీ చేస్తూ చాలా రోజుల క్రితమే ఉత్తర్వులు జారీచేసింది. ఇంటర్మీడి యెట్ ప్రాక్టికల్స్, పరీక్షలు ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్నాయి. ఈ తరుణంలో ఉదయలక్ష్మి శుక్రవారం బాధ్యతలు స్వీకరించడంతో పరీక్షల ఏర్పాట్లు మరింత చురుగ్గా సాగనున్నా యని బోర్డువర్గాలు పేర్కొన్నాయి.
Published date : 10 Dec 2016 01:49PM

Photo Stories