ఇంటర్‌లో ఇక గ్రేడింగ్ విధానం
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్‌లో ఇప్పటివరకు అమలులో ఉన్న మార్కుల విధానానికి స్వస్తి పలికి గ్రేడింగ్ విధానానికి ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు శ్రీకారం చుడుతోంది.
2017-18 విద్యాసంవత్సరంలో ఫస్టియర్(2018 మార్చిలో జరిగే) పరీక్షల నుంచే ఈ విధానాన్ని ప్రవేశపెడుతోంది. దీనిని అనుసరించి.. పరీక్ష ఫలితాలను గ్రేడ్‌లు, గ్రేడ్ పాయింట్లలోనే ప్రకటిస్తారు. మార్కులను ప్రకటించరు. ఆయా పేపర్లలో గరిష్ట మార్కులు 100 కన్నా తక్కువగా ఉంటే గ్రేడ్ పాయింట్ల కేటాయింపులో వాటిని 100కు పెంచి గణింపు చేస్తారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మిడిసెంబర్ 5న ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు అమలవుతున్న మార్కుల విధానం స్థానే గ్రేడింగ్ పద్ధతిని ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియెట్ బోర్డు గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఏయే మార్కులకు ఏయే గ్రేడులు వస్తాయో వివరించింది.
ఇదిలా ఉండగా ఒక్క అటెంప్ట్‌లో పరీక్ష రాసే అభ్యర్థులు ప్రతి పేపర్లో కనిష్టంగా 30 శాతం మార్కులు తెచ్చుకోవడంతో పాటు మొత్తం పేపర్లకు సంబంధించి సరాసరిన 35 శాతం సాధిస్తే పాసయినట్లుగానే పరిగణిస్తారు. వారి మార్కులు 30-34 మధ్య ఉంటే వారిని డీ2 గ్రేడ్‌గా పరిగణించి 3.0 పాయింట్లు కేటాయిస్తారు. 00-29 మార్కులు వచ్చిన వారిని ఎఫ్ గ్రేడులో ఉంచి ఫెయిల్ అయినట్లుగా ప్రకటిస్తారు.
దివ్యాంగులకు మినహాయింపు :
ఈ గ్రేడింగ్ విధానంలో దివ్యాంగులైన అంధ, మూగ, చెవిటి వారికి మినహాయింపులిచ్చారు. వీరు ప్రతి పేపర్లో కనిష్టంగా 25 మార్కులు తెచ్చుకుంటే పాస్ కింద పరిగణిస్తారు. వీరు 25-34 మార్కులు సాధిస్తే ‘ఇ’ గ్రేడ్‌గా పరిగణించి 2.5 గ్రేడ్ పాయింట్లు కేటాయిస్తారు. 00-24 మార్కులు సాధించే వారిని ఎఫ్ గ్రేడ్‌లో చేర్చి ఫెయిల్ కింద ప్రకటిస్తారు.
మార్కుల రేంజ్గేడ్ గ్రేడ్ పాయింట్లు

91-100 | ఏ1 | 10.0 |
81-90 | ఏ2 | 9.0 |
71-80 | బీ1 | 8.0 |
61-70 | బీ2 | 7.0 |
51-60 | సీ1 | 6.0 |
41-50 | సీ2 | 5.0 |
35-40 | డీ1 | 4.0 |
00-34 | ఫెయిల్ | ఫెయిల్ |
Published date : 06 Dec 2017 02:14PM