ఇంటర్‌లో గ్రేడింగ్ విధానం...?
Sakshi Education
‘‘ఇంటర్మీడియెట్ విద్యార్థులు మార్కులు, ర్యాంకుల విషయంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.. శ్రుతిమించిన ర్యాంకుల రేసు విద్యార్థుల్లోని సహజత్వాన్ని హరించి.. వారినో పోగ్రామింగ్ మెషీన్లుగా తయారు చేస్తోంది.. గ్రేడింగ్ విధానం అమలుతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి, నాణ్యమైన విద్యను అందించొచ్చు’’.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా వినిపిస్తున్న అభిప్రాయాలివి.. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియెట్‌లో గ్రేడింగ్ విధానం ప్రయోజనాలు, అమలు సాధ్యాసాధ్యాలపై విశ్లేషణ..
ప్రవేశ పరీక్షల ర్యాంకుల కేటాయింపులో ‘ఇంటర్ మార్కులకు వెయిటేజీ’ విద్యార్థులను కలవరపెడుతోంది. ఒక్క మార్కు తగ్గినా ర్యాంకు వందల్లో పడిపోతుంది. ఈ ఆందోళన విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు, ప్రైవేటు విద్యా సంస్థల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అదే విధంగా పోటీ పరీక్షల్లో మెరుగైన ర్యాంకులు సాధించాలంటూ పిల్లలపై విపరీతమైన భారం మోపుతూ ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో భావి పౌరులను బాహ్య ప్రపంచానికి దూరం చేసి.. సామాజిక పరిస్థితులపై కనీస అవగాహన లేని స్థాయికి వారిని తీసుకెళ్తున్నారు. ఫలితంగా విద్యార్థుల్లో మనోవికాసం, మానసిక స్థైర్యం లోపిస్తోంది. గత రెండు నెలల వ్యవధిలో పదుల సంఖ్యలో ఇంటర్ విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడడాన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
తెరపైకి గ్రేడింగ్ విధానం :
విద్యార్థుల బలవన్మరణాలపై మేధావులు, విద్యావేత్తల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇంటర్‌లో మార్కులకు బదులు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలని తెలుగు రాష్ట్రాల ఇంటర్మీడియెట్ బోర్డులు యోచిస్తున్నాయి. వీలైతే ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చి.. 2018లో నిర్వహించే వార్షిక పరీక్షల ఫలితాలను గ్రేడింగ్ విధానంలో విడుదల చేయాలని భావిస్తున్నాయి.
ఈ సంవత్సరం సాధ్యమేనా?
గ్రేడింగ్ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలుచేసి.. 2018 ఫలితాలను గ్రేడ్‌లలో ప్రకటించాలనే ఆలోచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల ప్రథమ సంవత్సరం ఫలితాలను మార్కుల విధానంలో ప్రకటించారు. కాబట్టి వారి ద్వితీయ సంవత్సరం ఫలితాలను గ్రేడ్ విధానంలో ఇవ్వడం సరికాదంటున్నారు. దీనివల్ల గందరగోళం తలెత్తే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రేడింగ్ విధానాన్ని 2018-19 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని.. 2019 ఫలితాలను గ్రేడింగ్ విధానంలో ఇవ్వాలని సూచిస్తున్నారు.
వెయిటేజీ.. సమస్య కాదా!
ఇంటర్ మార్కులకు ఎంసెట్‌లో వెయిటేజీ ఇస్తున్నారు. గ్రేడింగ్ అమలైతే నాలుగైదు మార్కులు తేడా ఉన్నవారు సైతం ఒకే గ్రేడ్ శ్రేణిలో నిలుస్తారు. తద్వారా ర్యాంకుల కేటాయింపులో ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థికి.. అతనికంటే నాలుగైదు మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థికి మధ్య వ్యత్యాసం ఉండదనే వాదన వినిపిస్తోంది. అయితే నిర్దిష్ట పద్ధతిలో గణన ద్వారా ఒకే శ్రేణిలో నిలిచిన విద్యార్థులకు సంబంధించి వారు పొందిన గ్రేడ్‌లను పర్సంటేజ్‌ల్లోకి మార్చవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి సీబీఎస్‌ఈ అనుసరిస్తున్న విధానాన్ని ఉదహరిస్తున్నారు. ప్రస్తుత సీబీఎస్‌ఈ గ్రేడింగ్ విధానంలో ఒక విద్యార్థి ఒక సబ్జెక్ట్‌లో పొందిన మార్కుల శాతాన్ని గణించేందుకు నిర్దిష్ట విధానం అమలవుతోంది. ఉదాహరణకు.. మ్యాథ్స్‌లో ఒక విద్యార్థి 8 గ్రేడ్ పాయింట్లతో బి1 గ్రేడ్ పొందాడనుకుంటే.. ఆ సబ్జెక్టులో అతడి పర్సంటేజీని గణించడానికి గ్రేడ్ పాయింట్లను (8ని) 9.5తో (గరిష్ట గ్రేడింగ్ మార్కులతో) గుణిస్తారు. (8ఁ9.5) అప్పుడు మ్యాథ్స్‌లో పర్సంటేజి 76గా ఉంటుంది.
సీజీపీఏ నిర్ధారణ
హెచ్‌ఆర్‌డీ నిర్దేశం :
మార్కులు, శాతాల విధానంతో విద్యార్థుల్లో పెరుగుతున్న ఒత్తిడిని నివారించేందుకు గ్రేడ్ విధానాన్ని అమలుచేయాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని బోర్డులకు సూచించింది. దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలుకు తగిన సిఫార్సులు చేయాలని కోరింది. ఇందులో భాగంగా గతేడాది రాకేశ్ చతుర్వేది (అప్పటి సీబీఎస్‌ఈ చైర్‌పర్సన్) నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గ్రేడింగ్ అమలును సిఫార్సు చేసింది.
ఆ దేశాల్లో హైస్కూల్ స్థాయిలోనే..
గ్రేడింగ్ విధానం అమలుతో విద్యార్థులపై భారం తగ్గుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. వాస్తవానికి పాశ్చాత్య దేశాల్లో హైస్కూల్ స్థాయిలోనే గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతకు దోహదపడేలా కరిక్యులం రూపొందిస్తున్నారు. మన దగ్గర మాత్రం విద్యార్థులను మార్కుల యంత్రాలుగా మారుస్తున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రుల ధోరణి సైతం సరిగాలేదు. కెరీర్ అంటే .. ఇంజనీరింగ్, మెడిసిన్ అని భావించడం.. ఎంట్రన్స్ టెస్టుల్లో బెస్ట్ ర్యాంకులు రావాలంటూ పిల్లలపై ఒత్తిడి తేవడంతోపాటు ర్యాంకుల కోసం రూ.లక్షలు వెచ్చించి కార్పొరేట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో చేరుస్తున్నారు. దీంతో సామాజిక ప్రగతికి దోహదపడాల్సిన చదువు.. మార్కెట్ వస్తువుగా మారింది. ఈ ధోరణికి వీలైనంత త్వరగా అడ్డుకట్ట వేయాలి.
- ప్రొఫెసర్ జి.హరగోపాల్, ప్రముఖ విద్యావేత్త.
ఉమ్మడి పరీక్షతో ఎలాంటి సమస్య ఉండదు..
ఇంటర్‌లో మార్కుల ఒత్తిడికి కారణం.. ఇంజనీరింగ్ చదవాలంటే రాష్ట్ర స్థాయిలో ఒక పరీక్ష (ఎంసెట్).. జాతీయ స్థాయిలో రెండు పరీక్షలు (జేఈఈ-మెయిన్, అడ్వాన్స్‌డ్) రాయాల్సి రావడమే. ఐఐటీల్లో చేరాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్ ఉత్తీర్ణతతోపాటు బోర్డు పరీక్షల్లో టాప్-20 పర్సంటైల్‌లో నిలవడం లేదా 75 శాతంతో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన ఉంది. ఇది సహజంగానే విద్యార్థులపై ఒత్తిడికి దారితీస్తోంది. దీనికి బదులుగా జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష నిర్వహించి.. అన్ని రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఆ పరీక్షలోని ర్యాంకునే పరిగణనలోకి తీసుకునే విధానం రావాలి.
- డాక్టర్ డి.ఎన్.రెడ్డి, డెరైక్టర్, సి.ఆర్.రావ్ ఏఐఎంఎస్‌సీఎస్.

- ఒక విద్యార్థికి గ్రూప్ సబ్జెక్టుల్లో వేర్వేరు గ్రేడ్ పాయింట్లు వచ్చినప్పుడు.. మొత్తం గ్రేడ్ పాయింట్లను నిర్ధారించేందుకు సీబీఎస్‌ఈ నిర్దిష్ట విధానాన్ని అమలు చేస్తోంది.
- ముందు ఐదు గ్రూప్ సబ్జెక్టుల్లో పొందిన గ్రేడ్‌లను కలుపుతారు.
- తర్వాత ఆ మొత్తాన్ని ఐదుతో భాగిస్తారు.
- వచ్చిన ఫలితం ఆధారంగా క్యుమిలేటివ్ గ్రేడ్ నిర్ణయిస్తారు.
- మొత్తం 9 శ్రేణుల్లో (ఎ1- ఇ) అభ్యర్థులు పొందిన మార్కుల ఆధారంగా సీబీఎస్‌ఈ గ్రేడ్‌లు కేటాయిస్తోంది. ఉదాహరణకు ఐదు గ్రూప్ సబ్జెక్టులకు కలిపి 42 గ్రేడ్ పాయింట్లు వచ్చాయనుకుంటే..ఆ సంఖ్యను ఐదుతో భాగాహారం చేస్తే వచ్చే ఫలితం 8.4 అవుతుంది. ఇదే అభ్యర్థి పొందిన సీజీపీఏ. దీని ఆధారంగా లెటర్ గ్రేడ్ (ఎ2) ఇస్తోంది.
హెచ్‌ఆర్‌డీ నిర్దేశం :
మార్కులు, శాతాల విధానంతో విద్యార్థుల్లో పెరుగుతున్న ఒత్తిడిని నివారించేందుకు గ్రేడ్ విధానాన్ని అమలుచేయాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని బోర్డులకు సూచించింది. దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలుకు తగిన సిఫార్సులు చేయాలని కోరింది. ఇందులో భాగంగా గతేడాది రాకేశ్ చతుర్వేది (అప్పటి సీబీఎస్‌ఈ చైర్‌పర్సన్) నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గ్రేడింగ్ అమలును సిఫార్సు చేసింది.
ఆ దేశాల్లో హైస్కూల్ స్థాయిలోనే..
గ్రేడింగ్ విధానం అమలుతో విద్యార్థులపై భారం తగ్గుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. వాస్తవానికి పాశ్చాత్య దేశాల్లో హైస్కూల్ స్థాయిలోనే గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతకు దోహదపడేలా కరిక్యులం రూపొందిస్తున్నారు. మన దగ్గర మాత్రం విద్యార్థులను మార్కుల యంత్రాలుగా మారుస్తున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రుల ధోరణి సైతం సరిగాలేదు. కెరీర్ అంటే .. ఇంజనీరింగ్, మెడిసిన్ అని భావించడం.. ఎంట్రన్స్ టెస్టుల్లో బెస్ట్ ర్యాంకులు రావాలంటూ పిల్లలపై ఒత్తిడి తేవడంతోపాటు ర్యాంకుల కోసం రూ.లక్షలు వెచ్చించి కార్పొరేట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో చేరుస్తున్నారు. దీంతో సామాజిక ప్రగతికి దోహదపడాల్సిన చదువు.. మార్కెట్ వస్తువుగా మారింది. ఈ ధోరణికి వీలైనంత త్వరగా అడ్డుకట్ట వేయాలి.
- ప్రొఫెసర్ జి.హరగోపాల్, ప్రముఖ విద్యావేత్త.
ఉమ్మడి పరీక్షతో ఎలాంటి సమస్య ఉండదు..
ఇంటర్‌లో మార్కుల ఒత్తిడికి కారణం.. ఇంజనీరింగ్ చదవాలంటే రాష్ట్ర స్థాయిలో ఒక పరీక్ష (ఎంసెట్).. జాతీయ స్థాయిలో రెండు పరీక్షలు (జేఈఈ-మెయిన్, అడ్వాన్స్‌డ్) రాయాల్సి రావడమే. ఐఐటీల్లో చేరాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్ ఉత్తీర్ణతతోపాటు బోర్డు పరీక్షల్లో టాప్-20 పర్సంటైల్‌లో నిలవడం లేదా 75 శాతంతో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన ఉంది. ఇది సహజంగానే విద్యార్థులపై ఒత్తిడికి దారితీస్తోంది. దీనికి బదులుగా జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష నిర్వహించి.. అన్ని రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఆ పరీక్షలోని ర్యాంకునే పరిగణనలోకి తీసుకునే విధానం రావాలి.
- డాక్టర్ డి.ఎన్.రెడ్డి, డెరైక్టర్, సి.ఆర్.రావ్ ఏఐఎంఎస్‌సీఎస్.
Published date : 09 Nov 2017 11:26AM