Skip to main content

ఇంటర్ వృత్తివిద్యా కోర్సుల్లో మార్పులు: ఇంటర్ బోర్డు కమిషనర్ వి.రామకృష్ణ

గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ వృత్తి విద్యా (ఒకేషనల్) కోర్సులను పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా, సత్వర ఉపాధి అందించే విధంగా తీర్చిదిద్దనున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు కమిషనర్ వి.రామకృష్ణ చెప్పారు.
గుంటూరు ఏసీ కళాశాలలో జనవరి 10 (శుక్రవారం)న ఇంటర్మీడియెట్ వృత్తి విద్యా కోర్సులను బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై వర్క్‌షాప్ నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్‌‌జ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా నైపుణ్యాలు పెంచాలన్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా వృత్తి విద్యా కోర్సుల సిలబస్‌లో మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. ఇంటర్మీడియెట్ స్థారుులో పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తున్న వృత్తి విద్యా కోర్సులను బలోపేతం చేసేందుకు సబ్జెక్టు నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులు సూచనలు ఇవ్వాలని కోరారు. వీటిని ప్రభుత్వ ఆమోదంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి తెస్తామని చెప్పారు.
Published date : 11 Jan 2020 03:11PM

Photo Stories