ఇంటర్ విద్యార్థుల ఆర్సీ, ఆర్వీ ఫీజులు వెనక్కి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: మార్చిలో జరిగిన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయి, రీకౌంటింగ్ (ఆర్సీ), రీవెరిఫికేషన్ (ఆర్వీ) కోసం దరఖాస్తు చేసుకున్న 21,537 మంది విద్యార్థుల ఫీజులను వెనక్కి ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది.
ఇంటర్ ఫలితాల్లో పొరపాట్ల నేపథ్యంలో ఫెయిల్ అయి, ఆర్సీ, ఆర్వీ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఫీజులను వెనక్కి ఇచ్చేయాలని అప్పట్లోనే ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఆయా విద్యార్థులకు సంబంధించిన రూ. 1,62,25,100 ను జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు/నోడల్ అధికారులకు విడుదల చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫీజు చెల్లించిన విద్యార్థులు తమ హాల్‌టికెట్/ఫీజు రసీదు చూపించి తమ ఫీజులను ఆయా అధికారుల నుంచి తీసుకోవాలని సూచించారు.
Published date : 26 Oct 2019 05:28PM