Skip to main content

ఇంటర్ తర్వాత ప్రవేశ పరీక్షలు

ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తిచేసుకున్న విద్యార్థుల ముంగిట ఎన్నో కోర్సులు! దేశవ్యాప్తంగా మరెన్నో యూనివర్సిటీలు/ఇన్‌స్టిట్యూట్‌లు.. వాటిలో ప్రవేశానికి రకరకాల ఎంట్రన్స్ టెస్ట్‌లు!! ప్రతిష్టాత్మక ఐఐటీలు, నిట్‌ల్లో ఇంజనీరింగ్ మొదలు..
ఎంబీబీఎస్, అగ్రికల్చర్, ఆర్కిటెక్చర్, సెన్సైస్, ఫ్యాషన్, డిజైన్ వరకూ.. అందుబాటులో వందల విద్యాసంస్థలు. ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో ఇంటర్ అర్హతతో అందుబాటులో ఉన్న పలు బెస్ట్ ఎంట్రన్స్ టెస్ట్‌ల వివరాలు..

  1. జేఈఈ మెయిన్
    • జేఈఈ మెయిన్.. పరిచయం అక్కర్లేని ఎంట్రన్స్ టెస్ట్. ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు అర్హులు. దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశానికి వీలు కల్పించే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హత పరీక్ష.. జేఈఈ మెయిన్. అంతేకాకుండా.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లు, ట్రిపుల్ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో బీటెక్, ఇంటిగ్రేటెడ్ బీటెక్+ఎంటెక్‌లో జేఈఈ మెయిన్ ర్యాంకు ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
    • మొత్తం మూడు విభాగాల్లో (ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ) 360 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో సబ్జెక్టు నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు.
    • బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులో ప్రవేశానికి పేపర్-2 పేరిట ప్రత్యేక పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్; ఆప్టిట్యూడ్ టెస్ట్, డ్రాయింగ్ టెస్ట్ విభాగాల్లో నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఈ పరీక్ష పూర్తిగా ఆఫ్‌లైన్ విధానంలో జరుగుతుంది.
    జేఈఈ మెయిన్-2018 ముఖ్యమైన తేదీలు...
    పరీక్ష విధానం:
    ఆఫ్‌లైన్ (పెన్-పేపర్ విధానం), ఆన్‌లైన్
    ఆఫ్‌లైన్ టెస్ట్ తేదీ: ఏప్రిల్ 8, 2018.
    ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: ఏప్రిల్ 15, 16, 2018
    l ఏటా పరీక్ష షెడ్యూల్ నవంబర్‌లో విడుదలవుతుంది.
    మరిన్ని వివరాలు వెబ్‌సైట్ చూడొచ్చు
    వెబ్‌సైట్: https://jeemain.nic.in
     
  2. జేఈఈ-అడ్వాన్స్‌డ్ :
    • ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్. జేఈఈ-మెయిన్ పేపర్-1లో ప్రతిభ ఆధారంగా 2.24 లక్షల మందిని జేఈఈ-అడ్వాన్స్‌డ్ రాసేందుకు అనుమతిస్తారు. ఈ పరీక్ష రెండు పేపర్లలో ఉంటుంది. ఒక్కో పేపర్ పరీక్ష సమయం మూడు గంటలు. ఈ ఏడాది నుంచి ఈ పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు.
    • మెయిన్ ఫలితాల ఆధారంగా.. 2.24 లక్షల మందిని అడ్వాన్‌‌సడ్‌కు ఎంపిక చేస్తారు. వీరు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.
    అర్హత: ఇంటర్మీడియెట్ బోర్డ్ పరీక్షల్లో టాప్-20 పర్సంటైల్‌లో నిలవాలి. (లేదా) ఇంటర్మీడియెట్ బోర్డ్ పరీక్షల్లో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 65 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది).
    జేఈఈ అడ్వాన్స్‌డ్-2018 ముఖ్యమైన తేదీలు:
    ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మే 2, 2018
    ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్చివరితేది: మే 7, 2018.
    అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: మే 14, 2018 - మే 20, 2018 వరకు.
    ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: మే 20, 2018.
    మరిన్ని వివరాలు వెబ్‌సైట్ చూడొచ్చు
    వెబ్‌సైట్: www.jeeadv.ac.in

  3. ఎంసెట్ :
    తెలుగు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో ఎంసెట్‌లో ర్యాంకు ద్వారా ప్రవేశం కల్పిస్తారు. రెండు రాష్ట్రాల్లోనూ వేర్వేరుగా ఎంసెట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.
    ఇంజనీరింగ్ స్ట్రీమ్ :
    అర్హత: ఇంటర్మీడియట్ ఎంపీసీ ఉత్తీర్ణత/ఫైనలియర్ విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
    కోర్సులు: బీఈ/బీటెక్/బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్)/బీటెక్ (డెయిరీ టెక్నాలజీ)/బీటెక్ (ఫుడ్‌టెక్నాలజీ)/బీటెక్ (బయోటెక్నాలజీ)/బీఫార్మసీ (ఎంపీసీ)/ఫార్మ్-డీ (ఎంపీసీ).
    అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ :
    అర్హత:
    బైపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత/ఫైనల్ పరీక్షలు రాసిన అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
    కోర్సులు: బీఎస్సీ (అగ్రికల్చర్)/బీఎస్సీ (హార్టికల్చర్)/బీఎస్సీ (ఫారెస్ట్రీ)/బీవీఎస్సీ అండ్‌ఏహెచ్ /బీఎఫ్‌ఎస్సీ/బీటెక్ (ఫుడ్‌టెక్నాలజీ); బీఫార్మసీ/బీటెక్ (బయోటెక్నాలజీ) (బైపీసీ); ఫార్మ్-డి (బైపీసీ).
    పరీక్ష విధానం:
    ఇంజనీరింగ్ స్ట్రీమ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ రెండు స్ట్రీమ్‌ల్లోనూ 160 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలుంటాయి. అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్‌లో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి.
    ఏపీ ఎంసెట్-2018 ముఖ్యమైన తేదీలు :
    ఆన్‌లైన్ అప్లికేషన్ తేదీలు: ఫిబ్రవరి 28-మార్చి 29, 2018.
    హాల్ టికెట్ డౌన్‌లోడ్ సదుపాయం: 2018, ఏప్రిల్ 18 నుంచి.
    ఆన్‌లైన్ టెస్ట్ తేదీలు...
    ఇంజనీరింగ్ స్ట్రీవ్ు: ఏప్రిల్ 22-25.
    అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీవ్ు : ఏప్రిల్ 25, 26.
    మరిన్ని వివరాలు వెబ్‌సైట్ చూడొచ్చు
    వెబ్‌సైట్: www.sche.ap.gov.in/EAMCET

  4. బిట్‌శాట్ :
    ఇంజనీరింగ్ విద్యలో మంచి పేరున్న ద బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్ -పిలానీ) బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తుంది. దీనిద్వారా బిట్స్ పిలానీ, గోవా, హైదరాబాద్ క్యాంపస్‌లలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
    అర్హత: ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత. అంతేకాకుండా ఇంజనీరింగ్ ఔత్సాహికులు ఎంపీసీ గ్రూప్ సబ్జెక్టుల్లో, బీఫార్మసీ ఔత్సాహికులు బైపీసీ గ్రూప్ సబ్జెక్ట్‌లలో 60 శాతం మార్కులు తప్పనిసరిగా పొందాలి.
    పరీక్ష విధానం: ఆన్‌లైన్ విధానం ఉంటుంది. బిట్‌శాట్ నాలుగు విభాగాల్లో ఉంటుంది. అవి.. ఫిజిక్స్; కెమిస్ట్రీ; ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ, లాజికల్ రీజనింగ్; మ్యాథమెటిక్స్ (ఇంజనీరింగ్ ఔత్సాహికులకు); బయాలజీ (బీఫార్మసీ ఔత్సాహికులకు). మొత్తం 150 ప్రశ్నలు. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
    ముఖ్యమైన తేదీలు:
    ఆన్‌లైన్ టెస్ట్ స్లాట్ రిజర్వేషన్ సదుపాయం: మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 వరకు.
    హాల్ టికెట్ డౌన్‌లోడ్ సదుపాయం: ఏప్రిల్ 12 నుంచి మే 10 వరకు.
    ఆన్‌లైన్ టెస్ట్ తేదీలు: మే 16 నుంచి మే 31 వరకు.
    ఫలితాల వెల్లడి: జూన్ 20, 2018
    మరిన్ని వివరాలు వెబ్‌సైట్ చూడొచ్చు
    వెబ్‌సైట్: www.bitsadmission.com

  5. నీట్-యూజీ :
    జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్, బీడీఎస్, తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. నీట్. ఈ పరీక్షను సీబీఎస్‌ఈ నిర్వహిస్తుంది. ఇందులో పొందిన మెరిట్ ఆధారంగా రాష్ట్రాల స్థాయిలో కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు ఖరారు చేస్తారు.
    అర్హత: బైపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత (ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులూ అర్హులే).
    పరీక్ష విధానం: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో మొత్తం 180 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది.
    ముఖ్యమైన తేదీలు:
    • ఆన్‌లైన్ అప్లికేషన్‌కు గడువు ముగిసింది.
    అడ్మిట్ కార్డ్ సదుపాయం: ఏప్రిల్ రెండో వారం నుంచి
    నీట్ పరీక్ష తేదీ: మే 6, 2018.
    మరిన్ని వివరాలు వెబ్‌సైట్ చూడొచ్చు
    వెబ్‌సైట్: https://cbseneet.nic.in

  6. ఎయిమ్స్ ఎంట్రన్స్ టెస్ట్:
    వైద్య విద్యలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థ.. ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్-న్యూఢిల్లీ. ఈ ఇన్‌స్టిట్యూట్ ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశానికి ప్రత్యేకంగా ఎంట్రన్స్ నిర్వహిస్తుంది. దీనిలో ర్యాంకు ద్వారా ఎయిమ్స్-ఢిల్లీతోపాటు పాట్నా, భోపాల్, జోధ్‌పూర్, భువనేశ్వర్, రిషికేశ్, రాయ్‌పూర్, గుంటూరు, నాగపూర్‌ల్లో ఎయిమ్స్ క్యాంపస్‌ల్లోనూ సీటు పొందొచ్చు. మొత్తం అన్ని క్యాంపస్‌లలో కలిపి అందుబాటులో ఉన్న సీట్లు 807.
    అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (బైపీసీ ఉత్తీర్ణత).
    పరీక్ష విధానం: మొత్తం 200 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీ) నుంచి 60 ప్రశ్నల చొప్పున; జనరల్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్ అండ్ లాజికల్ థింకింగ్ నుంచి 10 ప్రశ్నలు చొప్పున ఉంటాయి. ఆన్‌లైన్ విధానంలో పరీక్ష జరుగుతుంది.
    • దరఖాస్తు గడువు ముగిసింది.
    పరీక్ష తేదీ: మే 26, 27 తేదీల్లో రోజుకు రెండు సెషన్లుగా జరుగుతుంది.
    మరిన్ని వివరాలు వెబ్‌సైట్ చూడొచ్చు
    వెబ్‌సైట్: https://mbbs.aiimsexams.org/

  7. జిప్‌మర్ ఎంబీబీఎస్ ఎంట్రన్స్:
    ఎంబీబీఎస్ ఔత్సాహిక అభ్యర్థులకు అందుబాటులో ఉన్న మరో ప్రతిష్టాత్మక ఎంట్రన్స్.. జిప్‌మర్ ఎంబీబీఎస్. పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ క్యాంపస్‌లో, అదే విధంగా జిప్‌మర్-కరైకల్ క్యాంపస్‌లో ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశానికి ఈ ఎంట్రన్స్‌ను నిర్వహిస్తుంది. జిప్‌మర్-పుదుచ్చేరిలో 150 సీట్లు, కరైకల్‌లో 50 సీట్లు అందుబాటులో ఉంటాయి.
    అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బయోటెక్నాలజీ సబ్జెక్ట్‌లలో తప్పనిసరిగా 60 శాతం మార్కులు పొందాలి.
    పరీక్ష విధానం: పరీక్ష ఆన్‌లైన్ విధానంలో 200 మార్కులకు ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి 60 ప్రశ్నలు చొప్పున 180 ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్ నుంచి 10 ప్రశ్నలు; లాజికల్ అండ్ క్వాంటిటేటివ్ రీజనింగ్ నుంచి 10 ప్రశ్నలు ఉంటాయి.
    ముఖ్యమైన తేదీలు:
    ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: మార్చి 7, 2018 నుంచి ఏప్రిల్ 13, 2018 వరకు.
    హాల్ టికెట్ డౌన్‌లోడ్ సదుపాయం: మే 21, 2018 నుంచి జూన్ 3, 2018 వరకు.
    జిప్‌మర్ ఎంట్రన్స్ తేదీ: జూన్ 3, 2018
    మరిన్ని వివరాలు వెబ్‌సైట్ చూడొచ్చు
    వెబ్‌సైట్: www.jipmer.puducherry.gov.in

  8. ఐసీఏఆర్-ఏఐఈఈఏ:
    ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంస్థ.. జాతీయ స్థాయిలోని అగ్రికల్చర్ ఇన్‌స్టిట్యూట్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ అగ్రికల్చర్, హార్టికల్చర్, డెయిరీ టెక్నాలజీ తదితర బ్యాచిలర్ స్థాయి కోర్సుల్లో 15 శాతం సీట్ల భర్తీకి నిర్వహించే పరీక్ష.. ఆలిండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్. ఈ పరీక్షకు 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ అగ్రికల్చర్/మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణత సాధించాలి.
    పరీక్ష విధానం: ఐసీఏఆర్-ఏఐఈఈఏ రెండు స్ట్రీమ్‌ల్లో ఉంటుంది. స్ట్రీమ్-ఎలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, అగ్రికల్చర్/బయాలజీ నుంచి 60 ప్రశ్నల చొప్పున ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు. స్ట్రీమ్-బీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌ల నుంచి 60 ప్రశ్నల చొప్పున ఉంటాయి. అభ్యర్థులు తాము బ్యాచిలర్ స్థాయిలో చేరదలచుకున్న కోర్సుకు అనుగుణంగా ఏదో ఒక స్ట్రీమ్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
    పరీక్ష తేదీ: మే 12, 2018.
    మరిన్ని వివరాలు వెబ్‌సైట్ చూడొచ్చు
    వెబ్‌సైట్: www.icar.org

  9. నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ :
    జాతీయ స్థాయిలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గుర్తింపు పొందిన కళాశాలల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) కోర్సులో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా). దీనికి ఏటా జనవరిలో నోటిఫికేషన్ వెలువడుతుంది.
    అర్హత: మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌తో 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత లేదా 50 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత.
    పరీక్ష విధానం: నాటా రెండు విభాగాల్లో (పార్ట్-ఎ, పార్ట్-బి) నిర్వహించనున్నారు.
    పార్ట్-ఎ: ఇది పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో 120 మార్కులకు ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్, జనరల్ ఆప్టిట్యూడ్ అంశాల నుంచి 60 ప్రశ్నలుంటాయి. మొత్తం మార్కులు 120.
    పార్ట్-బి: ఇది డ్రాయింగ్ టెస్ట్. దీనికి కేటాయించిన మార్కులు 80.
    నాటా-2018 ముఖ్యమైన తేదీలు:
    దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 30, 2018.
    పరీక్ష తేదీ: ఆన్‌లైన్ టెస్ట్ ఏప్రిల్ 29న జరగనుంది.
    మరిన్ని వివరాలు వెబ్‌సైట్ చూడొచ్చు
    వెబ్‌సైట్: www.nata.in
Published date : 23 Mar 2018 06:24PM

Photo Stories