ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో సత్తాచాటిన బాలికలు
Sakshi Education
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్‌సడ్ సప్లిమెంటరీ పరీక్షల్లో బాలికలు సత్తా చాటారు.
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో బాలురకంటే వీరే పైచేయి సాధించారు. విశాఖపట్నంలోని ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను జూన్ 12న విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీసీ కెమేరాల నిఘాలో 887 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించామని, ప్రశ్నపత్రాల మూల్యాంకనంలో బయోమెట్రిక్ విధానం అమలు చేశామని చెప్పారు. పరీక్షలు జరిగిన 18 రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఫలితాలు విడుదల చేసినట్లు తెలిపారు. ఫస్టియర్ నుంచి 2,97,862, సెకండియర్ నుంచి 1,19,575 మంది, ఒకేషనల్ పరీక్షలకు (ఫస్టియర్ 11,710, సెకండియర్ 6,617) 18,327 మంది.. వెరసి 4,35,764 మంది హాజరైనట్లు చెప్పారు. ఇందులో ఇంటర్ మొదటి సంవత్సరం ఫెయిలయిన 1,53,319 మందికి 32 శాతంతో 48,998 మంది, బెటర్‌మెంట్ కోసం రాసిన 1,44,543 మంది 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఒకేషనల్‌లో ఫస్టియర్ 11,710 మందికి 55 శాతంతో 6,459 మంది పాసవగా.. ద్వితీయ సంవత్సరంలో 54,762 మందికి గాను 46 శాతం మంది, ఒకేషనల్‌లో 6,617 మందికి 3,559 (54 శాతం) మంది ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. ఫస్టియర్ బాలికలు 1,36,716 పరీక్షలు రాయగా 92,673 మంది (68 శాతం), బాలురు 1,61,150 మందికి 1,00,868 మంది (63 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ప్రథమ సంవత్సరం ఒకేషనల్‌లో బాలికలు 4,898 మందికి 2,948 మంది (60 శాతం), బాలురు 6,812 మందికి 3,511 మంది (52 శాతం) పాసయ్యారని పేర్కొన్నారు. సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలకు 48,903 మంది బాలికలు హాజరుకాగా 47 శాతం మంది అంటే.. 22,894 మంది, బాలురు 70,672 మందికి 31,868 మంది (45 శాతం) ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. ఒకేషనల్‌లో బాలికలు 2,346 మందికి 1,256 మంది (54 శాతం), బాలురు 4,271 మందికి 2,303 మంది (54 శాతం) పాసయ్యారన్నారు.
జూన్ 20లోగా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఫీజు :
ఇంటర్ (2018) సాధారణ ఫలితాల్లో ఫస్టియర్‌లో 62 శాతం ఉత్తీర్ణులవ్వగా సప్లిమెంటరీ ఫలితాలు వెలువడ్డాక అది 72 శాతానికి, ఒకేషనల్‌లో 52శాతం నుంచి 66 శాతానికి పెరిగిందన్నారు. సెకండియర్ ఫలితాలు చూస్తే.. సాధారణ ఫలితాల్లో 73 శాతం ఉత్తీర్ణులవగా సప్లమెంటరీ ఫలితాలు కలుపుకొంటే అది 86 శాతానికి, ఒకేషనల్‌లో 67 నుంచి 79 శాతానికి చేరిందని మంత్రి చెప్పారు. జూన్ 20లోగా జవాబు పత్రాలు రీకౌంటింగ్‌కు ఒక్కో పేపరుకు రూ.200, రీ వెరిఫికేషన్‌కు రూ.వెయ్యి చెల్లించాని మంత్రి తెలిపారు.
కేజీబీవీల్లో ఇంటర్ తరగతులు...
ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని 37 కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీలు), వచ్చే ఏడాది నుంచి అన్ని కేజీబీవీల్లో ఇంటర్ తరగతులు ప్రారంభమవుతాయని మంత్రి గంటా తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 50 జూనియర్, 15 డిగ్రీ కళాశాలలను మంజూరు చేసినట్టు చెప్పారు. అన్ని సదుపాయాలున్న చోట ఈ విద్యా సంవత్సరం నుంచే క్లాసులు ప్రారంభిస్తామని, మిగిలినవి వచ్చే ఏడాది నుంచి నిర్వహిస్తామని వివరించారు.

Published date : 13 Jun 2018 03:57PM