ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ గడువు పెంపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ ఫలితాలపై నెలకొన్న గందరగోళం నేపథ్యంలో ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు (ఏఎస్‌ఈ), రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు సంబంధించిన దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్ 23న ప్రకటించింది.
వాస్తవానికి ఏప్రిల్ 25 నాటికి దరఖాస్తు గడువు ముగియనుండగా.. మరో రెండ్రోజులపాటు గడువును పెంచింది. దీంతో ఏప్రిల్ 27 వరకు ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌తోపాటు టీఎస్ ఆన్‌లైన్ సేవా కేంద్రాల్లో ఫీజును చెల్లించేందుకు వెసులుబాటు కల్పించినట్లు బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. ఫలితాల్లో తప్పిదాలు చోటుచేసుకున్నాయంటూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గడువును పొడిగించాలని అన్ని వర్గాలు ఒత్తిడి చేయడంతో బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
Published date : 24 Apr 2019 12:57PM