ఇంటర్ రీ వెరిఫికేషన్‌కు 17 వేల దరఖాస్తులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ రీ వెరిఫికేషన్ కమ్ ఫొటో కాపీల (జవాబు పత్రాల జిరాక్స్ కాపీలు) కోసం విద్యార్థులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు.
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి మొత్తం 17,653 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ప్రథమ సంవత్సర విద్యార్థులు 6,528 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 11,125 మంది ఉన్నారు. ఇక మార్కుల రీకౌంటింగ్‌కు మొత్తం 2,947 దరఖాస్తులు రాగా, వాటిల్లో మొదట సంవత్సరానికి 1,229, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 1,718 దరఖాస్తులు వచ్చాయి.
మ్యాథ్స్, ఇంగ్లిషు, కెమిస్ట్రీలకే ఎక్కువ దరఖాస్తులు..
సబ్జెక్టుల వారీగా చూస్తే మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లోనే ఎక్కువ దరఖాస్తు వచ్చాయి. ద్వితీయ సంవత్సర మ్యాథ్స్-2బీలో రీ వెరిఫికేషన్‌కు 2,173 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక, ఇంగ్లిషులో 2,119, కెమిస్ట్రీలో 1,936 దరఖాస్తులు వచ్చాయి. రీకౌంటింగ్ కోసం అత్యధికంగా కెమిస్ట్రీ పేపర్-2కు 307 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Published date : 12 May 2018 04:44PM