ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు గడువు ఆగస్టు 17 వరకు పొడిగింపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫస్టియర్లో ప్రవేశాలకు ఆగస్టు 17 వరకు గడువును పొడిగించారు.
క్షేత్రస్థాయి నుంచి వినతులు రావడంతో ఈ మేరకు నిర్ణయించినట్లు ఇంటర్ బోర్డు శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలు, గురుకుల విద్యా సంస్థలు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది.
Published date : 02 Aug 2021 03:10PM