ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫీజు గడువు నవంబర్ 1
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం-2017 పరీక్ష ఫీజులను నవంబర్ 1వ తేదీలోగా ఆలస్యరుసుము లేకుండా చెల్లించవచ్చని ఇంటర్మీడియెట్ బోర్డు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
రెగ్యులర్ విద్యార్థులు, గతంలో ఫెయిలైన విద్యార్థులు (జనరల్, ఒకేషనల్), ప్రైవేటు అభ్యర్థులు, హ్యుమానిటీస్ గ్రూపు విద్యార్థులు ఈ పరీక్ష ఫీజులు చెల్లించాలన్నారు. ఆలస్యరుసుము రూ.120తో నవంబర్ 10, రూ.500తో నవంబర్ 17, రూ.1,000తో నవంబర్ 28, రూ.2 వేలతో డిసెంబర్ 21, రూ.3 వేలతో డిసెంబర్ 31, రూ.5 వేలతో 2017 జనవరి 18వ తేదీవరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. పరీక్ష ఫీజు గడువు పొడిగింపు ఇక ఉండబోదని, కనుక పరీక్షలకు హాజరుకాగోరే అభ్యర్థులు సకాలంలో ఫీజులు చెల్లించాలని సూచించారు. ఇలా ఉండగా సెకండియర్ ఫీజు గడువును నవంబర్ ఒకటో తేదీ వరకు పొడిగించారు. వివిధ స్థాయిల్లో ఆలస్యరుసుములతో 2017 జనవరి 18 వరకు ఫీజు చెల్లించవచ్చని బోర్డు సూచించింది.
Published date : 27 Oct 2016 02:35PM