ఇంటర్ ఫలితాల్లోని పొరపాట్లు సవరించాం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫలితాల వెల్లడిలో ఇంత అలసత్వమా...? ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాకం వల్ల ఇన్ని తప్పులా..? అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాఫ్ట్వేర్ సమస్యల కారణంగా మొదటి నుంచి డాటా ప్రాసెస్‌లో తప్పిదాలు చోటుచేసుకున్నాయి. దీంతో గందరగోళానికి గురైన బోర్డు ఫలితాలను సరిగ్గా ఇవ్వలేకపోయింది. మెమోల్లో తప్పులకు కారణమైంది. 8.7 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన ఫలితాల విషయంలో అలసత్వం ప్రదర్శించింది. వందలాది మంది విద్యార్థుల ఫలితాల్లో తప్పులు దొర్లాయి. అయితే, బోర్డు మాత్రం పొరపాట్లను సరిదిద్దేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముగ్గురు విద్యార్థుల ఫలితాల విషయంలో చీఫ్ సూపరింటెండెంట్లు పొరపాటు చేశారంటూ నెపాన్ని వారిపై నెట్టివేసింది. సామర్థ్యంలేని సాఫ్ట్వేర్ సంస్థకు డాటా ప్రాసెస్, ఫలితాల ప్రాసెస్ పనులను అప్పగించడంపై మొదటి నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నా పట్టించుకోకుండా చివరకు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంది. ఏప్రిల్ 18న ప్రకటించిన ఫలితాల్లో తప్పులు దొర్లడంతో 19న ఆ ఫలితాలను సవరించింది. పొరపాట్లు దొర్లిన విద్యార్థులు వందలాది మంది ఉన్నా కేవలం ముగ్గురి విషయంలోనే తప్పిదాలు జరిగాయని బోర్డు ప్రకటించింది. చివరకు ఫలితాల్లో పొరపాట్లను దిద్దుబాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. పొరపాట్లను సవరించామని వెల్లడించింది. విద్యార్థులు అధికారిక సమాచారం కోసం తమ వెబ్సైట్ (bie.telangana.gov.in)లోగాని, హెల్ప్‌డెస్క్(040-24600110)లోగాని సంప్రదింవచ్చని సూచించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి అశోక్ ఏప్రిల్ 19న ఒక ప్రకటన విడుదల చేశారు.
ఫలితాల్లో తప్పులపై బోర్డు కార్యదర్శి ఏం చెప్పారంటే...
‘ఇంటర్మీడియట్-2019 ఫలితాల్లో ముగ్గురు విద్యార్థుల మార్కుల మెమోల్లో తప్పులు దొర్లాయి. ద్వితీయ సంవత్సరం విద్యార్థి కావలి సాయికిరణ్ (హాల్‌టికెట్ నంబర్ 1959240336) ఇంగ్లిషు పేపరు-2 పరీక్ష రాసినా ఆబ్సెంట్, ఫెయిల్ అని రిజల్ట్ వచ్చింది. ముద్దసాని ప్రణయ్వ్యాస్(1959249896) ద్వితీయ సంవత్సరం సంస్కృతం పేపరు-2 పరీక్షకు హాజరైనా ఆబ్సెంట్, ఫెయిల్ అని వచ్చింది. ఈ ఇద్దరి విషయంలో ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు బ్లాంక్ బార్ కోడ్ వివరాలను ఇంటర్ బోర్డుకు సమర్పించనందున ఆ సబ్జెక్టుల మార్కులు మెమోల్లో రాలేదు. ఆ వివరాలను పరీక్ష కేంద్రం నుంచి సేకరించి ఆ విద్యార్థుల మెమోల్లో పొందుపరిచి సంబంధిత కాలేజీలకు పంపిస్తాం. మరో విద్యార్థి బెరైడ్డి వర్షిత్‌రెడ్డి(1959248716) ద్వితీయ సంవత్సరం ఇంగ్లిషు పేపరు-2 పరీక్షకు హాజరైనా మెమోలో ఆబ్సెంట్, ఫెయిల్ అని వచ్చింది. ఆ విద్యార్థి బ్లాంక్ బార్ కోడ్ వివరాలను బోర్డుకు సమర్పించే సమయంలో చీఫ్ సూపరింటెండెంట్ విద్యార్థి హాల్‌టికెట్‌ను తప్పుగా పొందుపర్చడం వల్ల మెమోలో ఆబ్సెంట్, ఫెయిల్ అని వచ్చింది. ఆ విద్యార్థికి సంబంధించిన సరైన హాల్‌టికెట్ నంబరుతో మార్కుల వివరాలను మెమోలో పొందుపరిచి సంబంధిత కాలేజీకి పంపిస్తాం. మేం పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటనలో పారదర్శకత, బాధ్యతతో, తప్పులు లేకుండా చేపట్టాం. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి సమాచారం కోసమైనా బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను లేదా హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలి’ అని పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్న బోర్డు :
ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల తప్పిదాల విషయంలో ఇంటర్మీడియట్ బోర్డు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తోంది. తమ నిర్ణయాల వల్ల ఎలాంటి తప్పులు దొర్లలేదని, పరీక్షల నిర్వహణ సిబ్బంది తప్పిదాల కారణంగా మూడు తప్పులే జరిగాయంటూ సరైన సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేస్తోంది. వందల మంది విద్యార్థుల మెమోల్లో మార్కులు రాలేదని, అనేక తప్పులు దొర్లాయని కాలేజీల యాజమాన్యాలు ఇంటర్మీడియట్ బోర్డుకు ఏప్రిల్ 19న రాతపూర్వకంగా విజ్ఞప్తులు చేసినా.. పెద్దగా తప్పులు జరగలేదన్నట్లు బోర్డు వ్యవహరించడం అనేక విమర్శలకు కారణం అవుతోంది. 44 మంది ఫస్టియర్ విద్యార్థులకు మెమోల్లో ఆబ్సెంట్ పడిందని, కొన్ని సబ్జెక్టుల్లో మార్కులు పడలేదని ఓ కాలేజీ యాజమాన్యం బోర్డుకు ఫిర్యాదు చేసింది. ద్వితీయ సంవత్సరంలోనూ 77 మంది విద్యార్థులకు మార్కులు పడలేదని, అబ్సెంట్ అని వచ్చిందని సదరు యాజమాన్యం బోర్డు అధికారులకు విద్యార్థుల పేర్లు, హాల్‌టికెట్ నంబర్లు, సబ్జెక్టులవారీ మార్కులు, మార్కులు రాని సబ్జెక్టుల వివరాలను అందజేసింది. ఇలా పదుల సంఖ్యలో కాలేజీలు బోర్డుకు విజ్ఞప్తులు అందజేసినా బోర్డు కార్యదర్శి అశోక్ మాత్రం ముగ్గురు విద్యార్థుల విషయంలోనే పొరపాట్లు దొర్లాయని ప్రభుత్వాన్నే తప్పుదోవ పట్టిస్తూ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో సాఫ్ట్వేర్ సమస్యలు తలెత్తలేదని, సదరు సాఫ్ట్వేర్ సంస్థను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసినట్లు తెలిసింది.

Published date : 20 Apr 2019 04:43PM