ఇంటర్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధం
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇంటర్ ద్వితీయ, ప్రథమ సంవత్సరపు పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12, 13 తేదీల్లో విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు ఏప్రిల్ 10న ఒక ప్రకటనలో వెల్లడించింది.
మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ ఫలితాలు విడుదల కానున్నాయి. సెకండియర్ ఫలితాలను ఏప్రిల్ 12న రాజమహేంద్రవరంలో సాయంత్రం 3 గంటలకు విడుదల చేస్తారు. ప్రథమ సంవత్సరం ఫలితాలను విశాఖలో ఏప్రిల్ 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారు.
Published date : 11 Apr 2018 03:04PM