ఇంటర్ ఫీజు గడువు నవంబర్ 4వరకు పెంపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: మార్చి-2020లో జరిగే ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు గడువును నవంబర్ 4 వరకు పొడిగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ అక్టోబర్ 26నఓ ప్రకటనలో పేర్కొన్నారు.
నిర్దేశిత గడువు వరకు విద్యార్థుల నుంచి ఫీజు స్వీకరించాల్సిందిగా జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ఫీజు మొత్తాన్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇంటర్ బోర్డుకు నవంబర్ 5లోగా చెల్లించాలని స్పష్టం చేశారు.
Published date : 28 Oct 2019 01:54PM