ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచేనా?
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియెట్ పరీక్షలు 2017 మార్చి ఒకటో తేదీ నుంచి జరిగే అవకాశముంది.
మార్చి 1 నుంచి 18వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు సోమవారం ప్రకటించడంతో దాదాపు అవే తేదీల్లో ఏపీలో కూడా జరగవచ్చన్న అభిప్రాయం విద్యాశాక అధికారవర్గాల నుంచి వ్యక్తమవుతోంది. రెండేళ్లుగా ఏపీ, తెలంగాణాల్లో ఇంటర్మీడియెట్ పరీక్షలు ఒకే తేదీల్లో, ఒకే సమయంలో జరిగేలా షెడ్యూల్‌ను ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే మాదిరిగా నిర్వహిస్తారా అనే అంశంపై అధికారికంగా నిర్ణయం తీసుకోవలసి ఉంది. మంత్రి గంటా శ్రీనివాసరావు, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌ల విదేశీ పర్యటన ఈనెల 23వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మంత్రి, ముఖ్యకార్యదర్శులు వచ్చాక బోర్డు పరీక్షలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Published date : 22 Nov 2016 04:11PM