ఇంటర్ పరీక్ష ఫీజు గడువు
Sakshi Education
నవంబర్ 15 సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజును నవంబర్ 15వ తేదీలోపు చెల్లించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రూ.120 అపరాధ రుసుముతో నవంబర్ 23వ తేదీలోగా, గరిష్ఠంగా రూ.5 వేల అపరాధ రుసుముతో జనవరి 19వ తేదీలోపు చెల్లించవచ్చని వివరించారు.
Published date : 08 Nov 2017 02:35PM