ఇంటర్ ప్రీ ఫైనల్ పరీక్షలు రీషెడ్యూల్
Sakshi Education
సాక్షి, విశాఖపట్నం: ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ప్రీ-ఫైనల్-1 పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. జనవరి 2 నుంచి 11 వరకు జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో జనవరి 19 నుంచి 25 వరకు జరగాల్సిన ప్రీ-ఫైనల్-1 పరీక్షల తేదీలను ప్రభుత్వం మార్చింది. తాజా నిర్ణయం ప్రకారం వీటిని జనవరి 22 నుంచి 25 వరకు, 30, 31 తేదీల్లో నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఆర్‌ఐవోలు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఇంటర్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి జనవరి 4న ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, జన్మభూమిని దృష్టిలో ఉంచుకుని ఇంటర్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులను కూడా ప్రభుత్వం మార్పు చేసింది. వాస్తవానికి ఇంటర్మీడియట్ బోర్డు జనవరి 7 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. అయితే ఈ సెలవులను జనవరి 12 నుంచి 20 వరకు ప్రభుత్వం మార్పు చేసింది.
Published date : 05 Jan 2018 01:55PM