Skip to main content

ఇంటర్ ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు సిలబస్ సవరణ

సాక్షి, హైదరాబాద్: ఒకేషనల్ బ్రిడ్జి కోర్సుకు సంబంధించి జీవ, భౌతిక, గణిత శాస్త్రాల సిలబస్‌ను 2016-17 విద్యా సంవత్సరం నుంచి సవరించినట్లు తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి శనివారం తెలిపారు.
కళాశాలల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యాలు, విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని 2017 మార్చిలో జరిగే వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని ఆయన సూచించారు. సవరించిన సిలబస్‌ను కళాశాలల లాగిన్‌తో పాటు బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. త్వరలో క్వశ్చన్‌బ్యాంక్, మోడల్ ప్రశ్నపత్రాలను అందుబాటులో ఉంచుతామన్నారు.
Published date : 19 Sep 2016 02:27PM

Photo Stories