Skip to main content

‘ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాలు నిరాకరించొద్దు’

సాక్షి, హైదరాబాద్: ఇంటర్నెట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న మెమో ఆధారంగా తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను కాలేజీల్లో చేర్చుకోవాలని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఒరిజినల్ పాస్ సర్టిఫికెట్, టీసీ తదితర సర్టిఫికెట్లు లేవన్న సాకుతో ప్రవేశాలను నిరాకరించొద్దని పేర్కొన్నారు. ఆ తర్వాత సర్టిఫికెట్లు తీసుకొచ్చి ఇచ్చేలా విద్యార్థుల నుంచి అండర్‌టేకింగ్ తీసుకోవాలని సూచించారు.
Published date : 19 Jul 2016 05:23PM

Photo Stories