ఇంటర్ ఇంగ్లిష్ ప్రశ్నపత్రంలో ముద్రణా లోపం
Sakshi Education
సాక్షి, విశాఖపట్నం/సత్తెనపల్లి: ఆంధ్ర్రపదేశ్ఇంటర్ ద్వితీయ సంవత్సర ఇంగ్లిష్ ప్రశ్నపత్రంలో ముద్రణా లోపం తలెత్తింది.
ఈనెల 4నజరిగిన ఈ పరీక్ష ప్రశ్నపత్రంలో సెక్షన్-బీలోని 8వ ప్రశ్నలో ఇచ్చిన చిత్రం సరిగా ముద్రితం కాలేదు. అయితే ఆ చిత్రంలోని టేబుల్‌పై అమర్చిన వస్తువులు ఏమిటి? అని ప్రశ్నించారు. బొమ్మ కనిపించకపోవడంతో విద్యార్థులు ఎవరూ ఆ ప్రశ్నకు సమాధానం రాయలేకపోయారు. దీంతో 5 మార్కులు నష్టపోవాల్సి వచ్చింది. అలాగే 9వ ప్రశ్నను బార్ గ్రాఫ్‌కు సంబంధించి అడిగారు. ఇది కూడా స్పష్టంగా లేదు. దీంతో విద్యార్థులు మరో 5 మార్కులు కోల్పోవాల్సి వచ్చింది. సెక్షన్-సీలోని 13వ ప్రశ్నలో ఇచ్చిన బ్యాంకు డిపాజిట్ ఫారం మొత్తం ముద్దముద్దగా ముద్రించడంతో ప్రశ్నల నంబర్లు కనిపించక విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. దీనికి సంబంధించి మొత్తం ఐదు మార్కు లకు గాను.. 10 ప్రశ్నలకు జవాబు రాయాల్సి ఉండగా 2, 3, 4, 5, 6 ప్రశ్నలు ఎక్కడున్నాయో కనిపించని పరిస్థితి. దీంతో ఆందోళనకు గురైన విద్యార్థులు ఈ విషయాన్ని ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకెళ్లగా.. వారు చేతులెత్తేశారు. దీనిపై విశాఖలోని ఇంటర్ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారి(ఆర్‌ఐవో) టి.నగేష్‌కుమార్‌ను వివరణ కోరగా.. 8, 9 ప్రశ్నలకు సంబంధించి విద్యార్థులకు పది మార్కులు కలుపుతామని అధికారుల నుంచి సమాచారం వచ్చిందని చెప్పారు.
Published date : 06 Mar 2017 02:01PM