ఇంటర్ హాల్‌టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం అక్కర్లేదు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఫిబ్రవరి 28 నుంచి జరగనున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్న విద్యార్థులనూ అనుమతించాలని తెలంగాణ ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
ఈ మేరకు బోర్డు కార్యదర్శి అశోక్ పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. హాల్‌టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. విద్యార్థులు www.tsbie.cgg.gov.in, www.exam.bie. www.telangana.gov.in, www.admi.tsbie.cgg.gov.in నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. యాజమాన్యాలు ఫీజులు చెల్లిస్తేనే హాల్‌టికెట్లు ఇస్తామంటూ విద్యార్థులను వేధిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
Published date : 27 Feb 2018 04:24PM