Skip to main content

ఇంటర్ బోర్డు మొబైల్ యాప్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు, యాజమాన్యాలకు ఇప్పటివరకు 22 రకాల సేవలను (15 విద్యార్థులకు, 7 కాలేజీ యాజమాన్యాలకు సంబంధించినవి) ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్న తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు వాటిలో 10 సేవలను ఇకపై మొబైల్ ద్వారా అందించేందుకు చర్యలు చేపట్టింది.
మైగ్రేషన్, ఈక్వలెన్సీ, ఎలిజిబిలిటీ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేయడం, వాటిని పొందడం వంటి సేవలను దీని ద్వారా పొందవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా TSBIE m-servicesపేరుతో యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ ఫోన్‌లోనూ బోర్డు సేవలను అందించేందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో రూపొందించిన యాప్‌ను బుధవారం బోర్డు కార్యదర్శి అశోక్ ఆవిష్కరించారు. దేశంలో ఎక్కడా బోర్డులు మొబైల్ యాప్ ద్వారా సేవలు అందుబాటులోకి తేలేదని, తామే మొదటిసారిగా అందుబాటులోకి తెచ్చామన్నారు.

అప్లికేషన్లు పంపించవచ్చు:
ఈ యాప్ ద్వారా విద్యార్థులు అప్లికేషన్లు పంపించవచ్చు. ఫీజులను క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అధికారులు ఆమోదించిన తర్వాత సర్టిఫికెట్‌ను మొబైల్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

యాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చిన సేవలు ఇవీ..:
  • మైగ్రేషన్ సర్టిఫికెట్
  • డూప్లికేట్ మార్క్స్ మెమో
  • డూప్లికేట్/ట్రిప్లికేట్ పాస్ సర్టిఫికెట్
  • ఈక్వలెన్సీ సర్టిఫికెట్
  • ఎలిజిబిలిటీ సర్టిఫికెట్
  • నేమ్ కరెక్షన్ ఆన్ పాస్ సర్టిఫికెట్
  • రీ వెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్స్
  • రీ కౌంటింగ్ ఆఫ్ మార్క్స్
  • అప్లికేషన్ స్టేటస్
Published date : 04 Aug 2016 03:30PM

Photo Stories