ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. ఈ విద్యార్థులు కూడా పాస్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో...పరీక్ష రాయలేకపోయిన 27,589 మంది ఇంటర్ విద్యార్ధులను గ్రేస్ మార్కులతో పాస్ చేయాలని నిర్ణయించింది. వీరిలో పరీక్షలకు హాజరుకాని వారు 27,251 ఉండగా, మాల్ ప్రాక్టీసు స్క్రూటినీ కమిటీ బహిష్కరించిన వారు 338 మంది ఉన్నారు. కోవిడ్-19 ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం నవంబర్ 3వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది.
Published date : 03 Nov 2020 05:52PM