Skip to main content

ఇక వర్సిటీలు, కాలేజీల్లో మొబైల్స్‌పై నిషేధం

లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకాన్ని అక్టోబర్ 16న నిషేధించింది.
ఈ మేరకు ఆ రాష్ట్ర ఉన్నత విద్యామండలి అక్టోబర్ 16న ప్రకటించింది. ఈ విద్యాలయాల పనిగంటల్లో ఫోన్ల నిషేధం అమలులో ఉంటుందని పేర్కొంది. ఇది తక్షణమే అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఉపాధ్యాయ సిబ్బందికీ ఈ నిషేధం వర్తిస్తుందని వెల్లడించింది. కాగా, కాలేజీ పనిగంటల్లో సైతం విద్యార్థులు, ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్లను విపరీతంగా వినియోగిస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందని పేర్కొంది. అందువల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది.
Published date : 18 Oct 2019 05:28PM

Photo Stories