హాజరు మినహాయింపుతో ఫీజు చెల్లించొచ్చు: ఇంటర్ బోర్డు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రెగ్యులర్‌గా చదవకుండా హాజరు మినహాయింపుతో ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరు కావాలనుకునేవారు సెప్టెంబర్ 30వ తేదీలోగా నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
రూ. 200 ఆలస్య రుసుముతో అక్టోబరు 31వ తేదీవరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది. వీటికి సంబంధించిన ఇతర నిబంధనలు, అర్హతలను తమ వెబ్‌సైట్‌లో పొందవచ్చని వెల్లడించింది.
Published date : 30 Aug 2017 01:55PM