Skip to main content

ఏప్రిల్ 7, 2017 తెలంగాణ ఇంటర్ బోర్డుకు జాతీయ స్థాయి అవార్డు

సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఇంటర్ బోర్డుల నిర్వహణలో సంస్కరణలు, వినూత్న ప్రయోగాలు, కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, అందిస్తున్న సేవల్లో మెరుగైన పనితీరు కనబరిచినందుకు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డుకు ‘టాప్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ అవార్డు లభించింది.
రీ థింక్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో దేశంలోని 35 ఇంటర్, ప్లస్ టు బోర్డులను పరిశీలించి పై అంశాలతో పాటుగా విద్యలో నాణ్యతా ప్రమాణాలను పాటించినందుకు రాష్ట్ర ఇంటర్ బోర్డును ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెల 11న జాతీయ సాంకేతిక దినోత్సవం (నేషనల్ టెక్నాలజీ డే) సందర్భంగా ఢిల్లీలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. డిజిటల్ తెలంగాణలో భాగంగా రాష్ట్ర ఇంటర్ బోర్డు సాంకేతికతను ఉపయోగించుకోవడంలో ఆన్‌లైన్ సర్వీసెస్ వంటి వాటిని ప్రవేశపెట్టడంలో ముందంజలో ఉందని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి తెలిపారు.
Published date : 08 Apr 2017 12:46PM

Photo Stories