ఏప్రిల్ 17 నుంచి ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో దూరవిద్య ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలను ఏప్రిల్ 17వ తేదీ నుంచి మే 1వ తేదీవరకు నిర్వహించనున్నట్లు సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 8:30 గంటల నుంచి 11:30 గంటల వరకు ఉంటాయిని పేర్కొంది. మే 1వ తేదీన అన్ని వొకేషనల్ సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహిస్తామని వివరించింది. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందవచ్చని వెల్లడించింది.
Published date : 17 Mar 2018 03:02PM