ఏప్రిల్ 17 లేదా 18 తేదీల్లో ఇంటర్ ఫలితాలు!
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇంటర్ పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 17 లేదా 18వ తేదీల్లో విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.
ప్రస్తుతం దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల ప్రశ్నపత్రాలను మూల్యాంకనం చేయిస్తున్న బోర్డు ఫలితాలను గతేడాదిలో కంటే ముందే విడుదల చేయాలని భావిస్తోంది. ‘‘గతేడాది ఏప్రిల్ 20న ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది అంతకన్నా రెండు లేదా మూడు రోజులు ముందే ఫలితాలివ్వడానికి ప్రయత్నిస్తున్నాం’’అని ఇంటర్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం మూల్యాంకనం ఎలాంటి ఆటంకాల్లే కుండా కొనసాగుతోందని వివరించారు. సంస్కృతం పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంక నానికి మాత్రం అధ్యాపకుల కొరత ఉన్నమాట నిజమేనన్నారు. మొత్తం రెండు సంవత్సరాలకు కలిపి 5.5 లక్షల సమాధాన పత్రాల్ని మూల్యాంకనం చేయాల్సి ఉందని, ఇందుకు తమకందుబాటులో ఉన్న అధ్యాపకులు 700 మందేనని చెప్పారు. అందువల్ల సంస్కృతం పేపర్ మూల్యాంకనంలో అదనంగా మరో గంటసేపు పేపర్లు దిద్దేలా ఏర్పాట్లు చేశామన్నారు.
వచ్చే ఏడాదికి సిలబస్ యథాతథం...
ఇంటర్ సిలబస్‌లో మార్పులు, చేర్పులు చేయబోవట్లేదని ఉదయలక్ష్మి వివరించారు. ప్రస్తుతం మూల్యాంకనం, ఫలితాల విడుదల వంటి కార్యక్రమాల్లో బోర్డు హడావుడిగా ఉందన్నారు. సిలబస్ మార్పునకు కమిటీలు వేయడం, వాటితో అధ్యయనం చేయించి మార్పులతో కొత్త సిలబస్ రూపొందించడం, ఆపై పాఠ్యపుస్తకాల ముద్రణ వంటి ప్రక్రియలకు సమయం సరిపోదన్నారు. మరో రెండు, మూడు నెలల్లో కాలేజీలు తెరవాల్సిన తరుణంలో కొత్త సిలబస్ పాఠ్యపుస్తకాలు సాధ్యం కాదన్నారు. జాతీయస్థాయిలో ఇంటర్‌లో కామన్ సిలబస్ అమలు చేయాలని కేంద్రప్రభుత్వం ఆలోచిస్తున్నందున ఇపుడు సిలబస్ మార్పులు చేసేకన్నా కేంద్రం నిర్ణయం తరువాత చేపడితేనే మంచిదని వివరించారు.

Published date : 24 Mar 2017 02:37PM