ఏప్రిల్ 12న ‘ఇంటర్’ ఫలితాల విడుదల !
Sakshi Education
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభమవుతాయని మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.
రోజూ ఉ.9 నుంచి 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. 10,17,600 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని చెప్పారు. వీరిలో 5,07,302 మంది ప్రథమ సంవత్సరం, 5,10,298 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారన్నారు. ఈ ఫలితాలు ఏప్రిల్ 12న వెల్లడిస్తామని మంత్రి చెప్పారు.
Published date : 13 Feb 2019 03:32PM