Skip to main content

ఏపీలోట్రిపుల్‌ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

నూజివీడు: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీలలో ఆరేళ్ల సమీకృత బీటెక్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఏప్రిల్ 30న నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ మేరకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ వివరాలు, దరఖాస్తు విధానాన్ని పొందుపరిచారు. ప్రథమ సంవత్సరంలో చేరేందుకు (2018-19) అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జూన్ 8లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్‌ఎస్‌సీ, దానికి సమానమైన పరీక్ష ఉత్తీర్ణులై 2018లో రెగ్యులర్ విద్యార్థులుగా ప్రథమ ప్రయత్నంలోనే ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2018 డిసెంబర్ 31 నాటికి 18 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 21 ఏళ్లు మించకూడదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు ఏపీ ఆన్‌లైన్ సర్వీసు ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రపతి, ప్రభుత్వ ఉత్తర్వులననుసరించి మొత్తం సీట్లలో 85 శాతం లోకల్ విద్యార్థులు (ఆంధ్రప్రదేశ్)కు, 15 శాతం సీట్లు ఓపెన్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తారు. నాలుగు కేంద్రాల్లో వెయి్య చొప్పున నాలుగు వేల సీట్లు కేటాయిస్తారు. పూర్తి వివరాలు www.rgukt.in వెబ్‌సైట్‌లో చూడవచ్చునని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.
Published date : 01 May 2018 02:11PM

Photo Stories