ఏపీలో 13న ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరపు పరీక్ష ఫలితాలు ఈనెల 13న విడుదల కానున్నాయి.
విజయవాడలో మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేస్తారని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల జనరల్, వొకేషనల్ కోర్సులకు సంబంధించిన అన్ని ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి ఒకటో తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలు 10,31,285 మంది రాశారు. 1,445 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షల్లో మొదటి సంవత్సరం 5,23,099 మంది, రెండో సంవత్సరం 5,08,186 మంది రాశారన్నారు. గత ఏడాదికన్నా ఈసారి పరీక్ష ఫలితాలను వారం రోజులు ముందుగా విడుదల చేస్తుండడం విశేషం. పరీక్ష ఫలితాలను www.sakshieducation.com లో చూసుకోవచ్చు. ఈ సేవ, మీసేవ, రాజీవ్ సిటిజన్ సర్వీస్‌సెంటర్లు, ఏపీ ఆన్‌లైన్ సెంటర్ల ద్వారా కూడా ఫలితాల సమాచారాన్ని పొందవచ్చని బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఫలితాల సమాచారం తెలిపే ఏర్పాట్లు చేశారు. ఫస్టియర్ జనరల్ ఫలితాలకు 54242కు ‘ఐపీఈ1 (సెకండియర్‌కు ఐపీఈజీ2) స్పేస్ హాల్‌టికెట్ నెంబర్ పంపాలి. 5676750 నంబర్‌కు కూడా ఐపీఈజీ1 (సెకండియర్‌కు ఐపీఈజీ2) స్పేస్ ఇచ్చి హాల్‌టికెట్ నంబర్ ఎస్సెమ్మెస్ పంపి కూడా సమాచారం పొందవచ్చునని వెల్లడించారు.
Published date : 12 Apr 2017 01:18PM