ఏపీలో 1 నుంచి ఇంటర్ పరీక్షలు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 10,31,285 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 5,23,099 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 5,08,186 మంది ఉన్నారు. మార్చి 1 నుంచి మొదటి సంవత్సరం,, 2 నుంచి రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అరగంట ముందుగా విద్యార్థులను లోనికి అనుమతిస్తారు. 9 గంటలు దాటాక ఎవరినీ అనుమతించబోమని ఇంటర్మీడియెట్ బోర్డు స్పష్టం చేసింది. ఈనెల 19వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఈ నెల 9వ తేదీన జరగాల్సిన మేథమెటిక్స్ 2బీ, జువాలజీ, హిస్టరీ పరీక్షలతో పాటు వొకేషనల్ కోర్సుల పరీక్షలను ఈ నెల 19 (ఆదివారం)న నిర్వహించ నున్నారు. ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,445 సెంటర్లను ఏర్పాటుచేశారు. ఇందులో 66 సెల్ఫ్ సెంటర్లున్నాయి. 524 ప్రభుత్వ జూనియర్, 148 ఎయిడెడ్ కాలేజీలతో పాటు 773 ప్రైవేటు కాలేజీల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు.
వెబ్‌సైట్‌లోనూ హాల్ టిక్కెట్లు :
విద్యార్థులు హాల్ టిక్కెట్లను కాలేజీల నుంచి లేదా నేరుగా బోర్డు వెబ్‌సైట్ "bieap.cgg.gov.ian'నుంచి డౌన్‌లోడ్ చేసుకొని పరీక్షకు హాజరు కావచ్చునని బోర్డు పేర్కొంది. విద్యార్థులు కింద కూర్చొని పరీక్ష రాయకుండా పరీక్ష కేంద్రాల్లో ఫర్నిచర్‌ను సమకూ ర్చాలని అన్ని జిల్లాల అధికారులకు సూచించినట్లు బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి వివరించారు. ఆర్టీసీ బస్సుల సమయాలను విద్యార్థులకు అనువుగా ఉం డేలా సర్దుబాటు చేయాలని కోరామని తెలిపారు.
ఇబ్బందులుంటే ఫోన్ చేయండి:
విద్యార్థులకు ఇబ్బందులేమైనా ఉంటే పరిష్కరించ డానికి విజయవాడలో కంట్రోల్‌రూమును ఏర్పాటు చేశామని చెప్పారు. ఇబ్బందులున్న వారు 0866 2974130, 0866 2970056 నంబర్లలో సంప్రదించ వచ్చని చెప్పారు. పరీక్షలకు సంబంధించి న సమాచారాన్ని ఈమెయిల్ ద్వారా తెలియచే యాలనుకొనే వారు ‘bieapcontrolroom@gmail.com‘కు సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు. టోల్‌ఫ్రీ నంబర్ 1800 274 9868లో కూడా సంప్రదించవచ్చని వివరించారు.
మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే 8 పరీక్షల వరకు నో చాన్స్:
పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడే వారిపై బోర్డు కఠిన చర్యలు చేపడుతుందని కార్యదర్శి తెలిపా రు. ఒకటి నుంచి 8 ఐపీఈ పరీక్షలకు అవకాశం లేకుండా డీబార్ చేయవచ్చని స్పష్టం చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. రాష్ట్రంలో 124 పరీక్ష కేంద్రాలను సమస్యాత్మక, సున్నితమై నవిగా గుర్తించి అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామన్నారు. 35 సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రంపచోడవరం, కేఆర్‌పురం, సీతంపేట, పాడేరు, పార్వతీపు రం, చింతూరు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అక్కడి ఐటీడీఏ అధికారుల సహకారాన్ని తీసుకుంటున్నట్లు తెలిపారు.

Published date : 01 Mar 2017 01:40PM