ఏపీ సీనియర్ ఇంటర్ ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, రాజమహేంద్రవరం/సాక్షి, అమరావతి: ఏపీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. బాలురు కన్నా 7 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. సీనియర్ ఇంటర్ పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 12న తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఓ హోటల్‌లో రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు.
పరీక్షలు ముగిసిన 24 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు. మొత్తం 73.33 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 77 శాతం, బాలురు 70 శాతం పాస్ అయ్యారు. ఇక ఫలితాల్లో కృష్ణా జిల్లా 84 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో, 59 శాతం ఉత్తీర్ణతతో వైఎస్సార్ జిల్లా చివరి స్థానంలో నిలిచాయి. 77 శాతంతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రెండో స్థానంలోనూ, 76 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా మూడో స్థానం దక్కించుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,423 పరీక్ష కేంద్రాల్లో 4,41,359 మంది జనరల్, 43,530 మంది ప్రైవేటు విద్యార్థులు వెరసి 4,84,889 మంది పరీక్షకు హాజరయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 3,23,645 (73.33 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షకు హాజరైన 4,41,359 మంది జనరల్ విద్యార్థుల్లో 2,22,423 మంది బాలికలకుగాను 1,71,454 మంది ఉత్తీర్ణత సాధించారు. 2,18,936 మంది బాలురు పరీక్షకు హాజరు కాగా 1,52,191 మంది పాసయ్యారు. వొకేషనల్ కోర్సుల్లోనూ బాలికల హవా కొనసాగింది. వొకేషనల్‌లో మొత్తం 29,273 మందికి గాను 19,645 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 14,647 మందికి గాను 10,753 (73 శాతం) మంది ఉత్తీర్ణులవ్వగా బాలురు 14,626 మందికిగాను 8,892 (61 శాతం) మంది పాసయ్యారు.
ప్రభుత్వ విద్యార్థుల్లో విజయనగరం హవా
ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థుల ఉత్తీర్ణతలో విజయనగరం 80 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (70 శాతం), మూడో స్థానంలో చిత్తూరు జిల్లా (65 శాతం) నిలిచింది. అత్యల్పంగా విశాఖ జిల్లా 47 శాతంతో చివరి స్థానంలో ఉంది. చివరి నుంచి రెండో స్థానంలో అనంతపురం, వైఎస్సార్ జిల్లా (53 శాతం), మూడో స్థానంలో గుంటూరు (56) ఉన్నాయి. ఎయిడెడ్ కాలేజీల్లో విజయనగరం (37శాతం), ప్రకాశం (40 శాతం), కర్నూలు (44 శాతం), అనంతపురం (52 శాతం), కృష్ణా (65 శాతం), చిత్తూరు, తూర్పుగోదావరి (66 శాతం) ఉత్తీర్ణత సాధించాయి.
మే 14 నుంచి సప్లిమెంటరీ..
మే 14 నుంచి సీనియర్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహిస్తామని మంత్రి గంటా తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 21వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని చెప్పారు.
ఫీజు గడువు పెంచేదిలేదు
సప్లిమెంటరీ పరీక్షకు హాజరుకాగోరే విద్యార్థులు గడువులోగా ఫీజును చెల్లించాలని ఇంటర్‌బోర్డు పేర్కొంది. ఆ గడువు తేదీ తర్వాత పెనాల్టీతో చెల్లింపునకు అవకాశం లేదని స్పష్టంచేసింది. ఉత్తీర్ణులు కాని విద్యార్థులతో పాటు మార్కుల ఇంప్రూవ్‌మెంటు కోరుకొనే వారు కూడా దీనికి దరఖాస్తు చేయవచ్చని, ఒక్కో పేపర్‌కు రూ. 120 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని బోర్డు తెలిపింది. రీకౌంటింగ్, స్కాన్‌డ కాపీలు, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేయడానికి కూడా ఏప్రిల్ 21లోగా నిర్ణీత ఫీజు చెల్లించాలని బోర్డు పేర్కొంది. రీ కౌంటింగ్‌కు ఒక్కో పేపర్‌కు రూ. 200, రీవెరిఫికేషన్, స్కాన్‌డ కాపీలకోసం ఒక్కో పేపర్‌కు రూ. 1,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
మొబైల్ సందేశం ద్వారా ఫలితాలు
పరీక్ష ఫలితాలను ప్రభుత్వం 44 వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచింది. htpp://examresults.ap.nic.in, తదితర వెబ్‌సైట్లతోపాటు www.sakshieducation.com ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. మీ-సేవ, ఇ-సేవ, ఏపీఆన్‌లైన్ కేంద్రాల ద్వారా పొందొచ్చు. విద్యార్థులు మొబైల్ సందేశం ద్వారా ఫలితాలు తెలుసుకోవడానికి మొబైల్‌లో IPE2 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాల్‌టిక్కెట్ నంబర్ టైప్ చేసి 54242 నంబర్‌కు సందేశం పంపాలి.
ర్యాంకుల్లోనూ బాలికలదే హవా..
ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపుల వారీగా టాప్ 10 స్థానాల్లో నిలిచిన వారి జాబితాను ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఐదు గ్రూపుల్లోనూ టాప్ 10 ర్యాంకుల్లో బాలికల హవా కొనసాగింది. ఐదు గ్రూపుల్లో మొత్తం టాప్ 50లో బాలురు 11 మంది మాత్రమే ఉండగా 39 ర్యాంకులు బాలికలు సొంతం చేసుకున్నారు. ర్యాంకుల్లో సమాన మార్కులు అత్యధిక శాతం మందికి వచ్చాయి. ఎంపీసీలో ఒకటో ర్యాంకు అభ్యర్థికి 992 మార్కులు రాగా రెండో ర్యాంకు విద్యార్థికి 991 వచ్చాయి. తక్కిన 8 స్థానాల్లో నిలిచిన వారందరికీ 990 మార్కులు వచ్చాయి. బైపీసీలో మొదటి నలుగురికి 990 రాగా, తక్కిన స్థానాల్లోని వారికి 989 మార్కులు లభించారుు. తక్కిన గ్రూపుల్లోనూ ఇదే మాదిరిగా మార్కులు ఉన్నాయి.

Published date : 13 Apr 2018 06:37PM