Skip to main content

ఏపీ ఇంటర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వార్షిక పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు నిర్వహించనున్నారు.
నవంబర్ 8న విజయవాడలో రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు. నిర్దేశిత తేదీల్లో రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రథమ సంవత్సర పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 17 వరకు, ద్వితీయ సంవత్సర పరీక్షలు మార్చి 1 నుంచి 19 వరకు జరుగుతాయి. జనవరి 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష ఉంటుంది. అదే నెల 29న అదే సమయంలో ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 21 వరకు ఉంటాయి. జనరల్‌తోపాటు వొకేషనల్ విద్యార్థులకు ఇవే పరీక్ష తేదీలు వర్తిస్తాయి. కాగా తెలంగాణ ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 1న మొదలవుతాయి. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో గ్రేడింగ్ విధానం అమలు చేయనున్నట్టు తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు మార్కుల స్థానంలో గ్రేడింగులు ఇస్తామన్నారు. మొత్తం ఏడు గ్రేడ్‌లు ఉంటాయని పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షలకు 10,48,688 మంది విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు. వీరిలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు 4,96,660 మంది, సెకండియర్ విద్యార్థులు 4,82,235 మంది ఉన్నారని తెలిపారు. ఇంటర్ థియరీ పరీక్షలకు 1600 కేంద్రాలు, ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలకు 1077 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జంబ్లింగ్ విధానంలోనే పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. కాగా నిర్దిష్ట సమయానికి మించి స్టడీ అవర్లు నిర్వహిస్తున్న 205 కళాశాలలకు నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు.

ఇంటర్మీడియెట్ పరీక్షల టైంటేబుల్...

తేదీ

ఫస్టియర్

తేదీ

సెకండియర్

28-2-2018

ద్వితీయ భాష పేపర్-1

1-3-2018

ద్వితీయ భాష పేపర్-2

3-3-2018

ఇంగ్లిష్ పేపర్-1

5-3-2018

ఇంగ్లిష్ పేపర్-2

6-3-2018

మ్యాథమెటిక్స్ పేపర్-1ఎ,
బోటనీ పేపర్-1,
సివిక్స్ పేపర్-1,
సైకాలజీ పేపర్-1

7-3-2018

మ్యాథమెటిక్స్ పేపర్-2ఎ,
బోటనీ పేపర్-2,
సివిక్స్ పేపర్-2,
సైకాలజీ పేపర్-2

8-3-2018

మ్యాథమెటిక్స్ పేపర్-1బి,
జువాలజీ పేపర్-1,
హిస్టరీ పేపర్-1

9-3-2018

మ్యాథమెటిక్స్ పేపర్-2బి
జువాలజీ పేపర్-2,
హిస్టరీ పేపర్-2

10-3-2018

ఫిజిక్స్ పేపర్-1,
ఎకనామిక్స్ పేపర్-1,
క్లాసికల్ లాంగ్వేజ్ పేపర్-1

12-3-2018

ఫిజిక్స్ పేపర్-2,
ఎకనామిక్స్ పేపర్-2,
క్లాసికల్ లాంగ్వేజ్ పేపర్-2

13-3-2018

కెమిస్ట్రీ పేపర్-1,
కామర్స్ పేపర్-1,
సోషియాలజీ పేపర్-1,
ఫైన్‌ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-1

14-3-2018

కెమిస్ట్రీ పేపర్-2,
కామర్స్ పేపర్-2,
సోషియాలజీ పేపర్-2,
ఫైన్‌ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-2

15-3-2018

జియాలజీ పేపర్-1,
హోంసైన్‌‌స పేపర్-1,
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1,
లాజిక్ పేపర్-1,
బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-1 (బైపీసీవారికి)

16-3-2018

జియాలజీ పేపర్-2,
హోంసైన్‌‌స పేపర్-2,
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2,
లాజిక్ పేపర్-2,
బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-2 (బైపీసీ వారికి)

17-3-2018

మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-1,
జాగ్రఫీ పేపర్-1

19-3-2018

మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-2,
జాగ్రఫీ పేపర్-2.

Published date : 09 Nov 2017 02:17PM

Photo Stories