‘ఎంపీసీ టాపర్లకు’ విట్ ఏపీలో ఉచిత విద్య
Sakshi Education
అమరావతి: ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదివి ఆయా జిల్లాల్లో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థులకు విట్-ఏపీలో ఇంజనీరింగ్ విద్యను ఉచితంగా అందించనున్నట్లు విట్-ఏపీ వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్ తెలిపారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఉన్నత చదువులకి పేదరికం అడ్డుకాకూడదనే లక్ష్యంతో విట్‌లో ‘స్టార్స్’(సపోర్ట్ ది అడ్వాన్‌సమెంట్ ఆఫ్ రూరల్ స్టూడెంట్స్) అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు. ‘స్టార్స్’ప్రోగ్రాంలో భాగంగా ప్రతీ జిల్లా నుంచి ఒక బాలుడు, ఒక బాలికకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇంటర్-2019లో ఏపీలోని పదమూడు జిల్లాల్లో ప్రభుత్వ కళాశాలలో చదివి ప్రథమ ర్యాంకు సాధించిన 26 మంది విద్యార్థులకు ఇంజనీరింగ్‌లో ప్రవేశపత్రాలను జూన్ 17న విశ్వనాథన్ అందించారు. కార్యక్రమంలో విట్-ఏపీ వీసీ డాక్టర్ డి.శుభకర్, రిజిస్ట్రార్ డాక్టర్ సీఎల్వీ శివకుమార్, అడ్మిషన్‌స అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు.
Published date : 18 Jun 2019 03:05PM