ఎంపీసీ, బైపీసీల్లో మార్కుల వరద
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన వారిలో ఎంపీసీ గ్రూపు విద్యార్థులే ఎక్కువ ఉన్నారు. బైపీసీ గ్రూపు విద్యార్థులు రెండో స్థానంలో నిలిచారు.
ఎంపీసీ గ్రూపులో టాపర్‌గా నిలిచిన విద్యార్థి మార్కులు 992. ఆతరువాత 991 మార్కులతో రెండో స్థానంలో ఒకే అభ్యర్థి ఉన్నారు. ఆ తరువాత 973 నుంచి 990 వరకు మార్కులు సాధించిన వారి సంఖ్య 8711గా ఉంది. ఇక బైపీసీలో టాప్ మార్కులు 990 కాగా నలుగురు విద్యార్థులు వీటిని సాధించారు. 971నుంచి 989 మధ్య మార్కులు సాధించిన వారు 2416 మంది ఉన్నారు. ఎంఈసీలో అత్యధిక మార్కులు 982 కాగా ఆతరువాత 963 మార్కుల వరకు సాధించిన మొత్తం విద్యార్థులు 365 మంది ఉన్నారు. హెచ్‌ఈసీలో 968 టాప్‌మార్కులు. ఈ గ్రూపులో 968 నుంచి 947 వరకు మార్కులు వచ్చిన వారు 55 మంది ఉన్నారు. సీఈసీలో అత్యధిక మార్కులు 966 కాగా 916కు పైగా మార్కులు పొందిన వారు 30 మంది ఉన్నారు.
Published date : 14 Apr 2018 10:58AM